25 students, killed in Malaysia school fire కౌలాలంపూర్ అగ్నిప్రమాదం.. 25మంది సజీవదహనం

Kuala lumpur school fire kills at least 25 mostly students

Malaysia, school fire, Religious School, Kuala Lumpur, Tahfiz Darul Quran Ittifaqiyah, Datuk Keramat, fire accident, fire in kuala lumpur school, crime

Twenty-five people, most of them students, were killed when a fire tore through a religious school in the Malaysian capital Kuala Lumpur on Thursday, an official said.

కౌలాలంపూర్ అగ్నిప్రమాదం.. 25మంది సజీవదహనం

Posted: 09/14/2017 10:02 AM IST
Kuala lumpur school fire kills at least 25 mostly students

మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఇవాళ వేకువజామున జరిగిన ఈ ప్రమాదంలో అనేకమంది విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, వార్డెన్లు కూడా సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన మరో 10 మంది పరిస్థితి కూడా విషమంగానే వుంది. కాగా ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదముందని వైద్యవర్గాల సమాచారం.

కౌలాలంపూర్ లోని మలేలు నివస్తుస్తున్న ప్రధాన ప్రాంతమైన డాటుక్ కెరామత్ ప్రాంతంలో సంభవించింది. ప్రమాద వార్తను అందుకున్న అగ్నిమాపక దళాలు శరవేగంగా స్పందించినా.. అప్పటికే జరగకూడని ఘోరం జరిగిపోయిందని అధికారులు అవేదన వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక దళాలు అక్కడికి చేరకుని మంటలు అర్పేశారని.. ప్రమాదం బారిన పడిన కొందరిని రక్షించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ ఖిరుదిన్ ద్రాహ్మాన్ ఆవేదన వ్యక్తంచేశారు.

డాటుక్ కెరామత్ ప్రాంతంలో ఉన్న ఓ రెండస్థుల భవనంలో ఓ మత పాఠశాల హాస్టల్ నిర్వహిస్తుంది. ఈ హాస్టల్ లోని విద్యార్ధులకు అక్కడే తరగతులను నిర్వహించిన తరువాత పై అంతస్థులలో వున్న తమ హాస్టల్ గదులలోకి వెళ్లి అక్కడే వుంటారు. ఇవాళ వేకువ జామున జరిగిన ప్రమాదంలో హస్టల్ గదులలో నిద్రిస్తున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, వార్డెన్లు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై ప్రధాని నజీబ్ రజాక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

గత రెండు దశాబ్దాలలో మలేషియాలోని పాఠశాల్లో చోటుచేసుకున్న అతిపెద్ద అగ్నిప్రమాదం ఇదేనని చెప్పారు. కౌలాలంపూర్ నగరంలోని మత పాఠశాలలో మంటలు చెలరేగిన విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేసింది. ఇద్దరు వార్డెన్లు, 23 మంది విద్యార్థులు మృతిచెందినట్లు అధికారులు భావిస్తున్నారు. బెడ్ రూమ్ లో ఏర్పడ్డ మంటలు కొంత సమయానికే భవనం మొత్తం వ్యాపించడంతో ఎక్కువ మరణాలు సంభవించినట్లు డైరెక్టర్ చెప్పారు. ప్రమాదానికి కారణాలపై విచారణ చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles