Heavy Rain Causes Floods In Hyderabad నగరం అతలాకుతలం.. చిధ్రం చేసిన చినుకు..

Heavy rain causes floods in hyderabad creates havoc

heavy rain,heavy rains,rains in hyderabad,water logged roads,roads in hyderabad,weather report,weather in hyderabad,heavy rains in hyderabad,hyderabad news,rains in telangana,Hyderabad roads in rainy season,weather updates,weather expert,sudden rains in hyderabad,huge rains,weather forecast,weather in telangana,heavy rains lashes hyderabad, rains in miyapur, rains in madinaguda, rains in patancheru, rain in secundrabad, rain in panjagutta, rain in uppal, rain havoc situation

Heavy rains lashed Hyderabad city making appartments and roads drown seeming just like tanks. Heavy downpour in the city led to a flood-like situation in most places, choking traffic and inundating low-lying areas.

ITEMVIDEOS: నగరం అతలాకుతలం.. చిధ్రం చేసిన చినుకు..

Posted: 09/14/2017 10:53 AM IST
Heavy rain causes floods in hyderabad creates havoc

హైదరాబాద్ నగరంలో నిన్న రాత్రి నుంచి ఇవాళ ఉదయం వరకు ఏకంధాటిగా కురిసిన వర్షానికి నగరవాసి జనజీవనం స్థంభించిపోయింది. వరుణుడు విజృంభించడంతో లోతట్టు ప్రాంతాల్లోని అపార్టుమెంట్లు, ఇళ్లు జలదిగ్భంధనంలో చిక్కుకున్నాయి. పలు ప్రాంతాల్లో నగర రోడ్లపై వర్షపు నీరు ధాటిగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలింగింది. బుధవారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షపు చినుకులు.. నగరవాసి జీవనాన్ని ఛిధ్రం చస్తున్నాయి.

రాత్రాంతా ఏకధాటిగా కురిసిన వర్షంతో తెల్లవారు జామున లేచి చూసేసరికి పల్లు చోట్ల ఇళ్లలోని నీరుచేరగా, మరోకొన్ని చోట్ల రోడ్లు జలమయమయ్యాయి, పలు దిగువ ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షానికి రోడ్లు వాగుల్లా మారిపోయాయి. నాలాలు పొంగి పొర్లడంతో బస్తీల్లోకి నీళ్లు చేరుకున్నాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. హైదరాబాద్,  సికింద్రాబాద్ లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ట్రాఫిక్ జామ్ లతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

మల్కాజిగిరి, నేరెడ్ మెట్, లాలాపేట, మియాపూర్, మదీనాగూడ, పటాన్ చెరు, రామచంద్రాపురం, పంజాగుట్టా, సికింద్రాబాద్, ఉప్పల్, నాచారం తదితర ప్రాంతాల్లోని ప్రజలు వాననీటితో ఇబ్బందులు పడుతున్నారు. బండచెరువు కట్ట తెగిపోవడంతో లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు చేరుకున్నాయి. తూర్పు ఆనంద్‌బాగ్, షిరిడీనగర్, వెంకటేశ్వరనగర్, చంద్రబాబునగర్ ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరుకుంది. అధికారులు, కార్పొరేటర్లకు చెప్పినా పట్టించుకోలేదని బస్తీవాసులు ఆరోపిస్తున్నారు. ఇక ఖైరతాబాద్, పంజాగుట్ట, మైత్రీవనం, ఎర్రగడ్డ, ఎల్బీనగర్,  భైరామల్ గూడలోని లోతట్టు ప్రాంతాల్లోకి వర్షం నీరు చేరుకుంది.

కాగా ఇవాళ కూడా వర్షాలు కురిసే అవకాశాలు వున్నాయిని వాతావరణ కేంద్రం అధికారులు నగరవాసులను అప్రమత్తం చేయడంతో.. జీహెచ్ఎంసీ అధికారులు కూడా అలెర్ట్ అయ్యారు. హైదరాబాద్ లో మబ్బులు కమ్మేసిన నేపథ్యంలో ఎప్పుడు ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమయినా వాటిని ఎదుర్కొనేందుకు తమ సిబ్బందిని సమాయత్తం చేశారు. చెరువులు, నాలాల పరిధిలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. ఎమర్జెన్సీ టీంల కోసం 040-21111111 అనే ఫోన్ నెంబర్ కు సమాచారం ఇవ్వాలని, ఈఈ, సర్కిల్ కమిషనర్లు ఫీల్డ్ లో ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : heavy rain  flood in hyderabad  roads tanks  sudden rain lash  hyderabad  climatic conditions  

Other Articles