court takes social media evidence in convicting law students వాట్సాప్ సాక్ష్యంతో దోషులకు శిక్ష.. కటకటాల్లోకి కామాంధులు

Whatsapp chats land three law students of sonepat university in prison for rape

electronic data used as evidence, court takes social media evidence, court takes whatsapp evidence, sexual assult video on social media, Whatsapp, Court evidence, Social media, Whatsapp chats as evidence, Sonepat gangrape case, Global Jindal University, Hardik Sikri, Karan Chhabra, Vikas Garg

Three students of Global Jindal University in Sonepat were sentenced on May 24 –main accused Hardik Sikri and his friend Karan Chhabra for 20 years each for gangraping and blackmailing a junior from the same varsity. The third, Vikas Garg, was handed a seven-year jail term.

వాట్సాప్ సాక్ష్యంతో దోషులకు శిక్ష.. కటకటాల్లోకి కామాంధులు

Posted: 06/06/2017 11:09 AM IST
Whatsapp chats land three law students of sonepat university in prison for rape

భారతీయ న్యాయవ్యవస్థలో తొలిసారి ఓ ఎలక్ట్రానిక్ డాటాను అధారంగా చేసుకుని కామాంధులకు కఠిన శిక్షను విధిస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఇప్పటి వరకు న్యాయస్థానంలో ఎలక్ట్రానిక్ డాటాను అధారంగా చేసుకోలేదు. అయితే పలు కేసుల్లో వీడియోలు, అడియోలను సాక్షాలుగా పరిగణించినా.. తొలిసారిగా సామాజిక మాద్యమం ద్వారా చాట్ చేసిన డాటాను, అదే సోషల్ మీడియాలో బాధితురాలికి సంబంధించిన దృష్యాలను పెట్టి తమ ఫ్రెండ్స్ కు పంఫిణీ చేయడం లాంటి అంశాలను తొలిసారిగా న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది.

హర్యానాలోని సోనేపట్‌ లో గల ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో తమ జూనియర్ గా చేరిన బాధితురాలిని రెండేళ్ల పాటు లైంగికంగా వేధించి.. పలుమార్లు అమెపై అత్యాచారానికి ఒడిగట్టి.. అమె నగ్న చిత్రాలను తీసి తమ స్నేహితులకు పంపి ఫైశాచిక అనందం పోందడంతో పాటు దానిని యాపిల్ ఐ క్లౌడ్ లో దాచినందుకు గాను సీనియర్ విద్యార్థులను దోషులుగా తేల్చిన న్యాయస్థానం.. అందుకు సామాజిక మాద్యమంలో వారు సాగించిన సంభాషణను అధారంగా చేసుకునింది. దీంతో వారిలో ప్రధాని దోషితో హార్దిక్ సిక్రీ పాటు అతడి స్నేహితుడు కరణ్ ఛాబ్రా 20 ఏళ్ల పాటు జైలు శిక్షను విధించగా, మరో విద్యార్థి వికాస్ గార్గ్ కి ఏడేళ్ల పాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది.

ఇక అప్పటి నుంచి అమెను నిత్యం నరకం చూపుతు వచ్చారు. దీంతో పాటు ఈ విషయాన్ని ఎవరికైనా చెడితే దేనికైనా వెనుకాడబోమని, బాధిరతురాలితో పాటు అమె కుటుంబ పరువును కూడా  తీసేస్తామని బెదిరించారు. దూర ప్రాంతాలకు బలవంతంగా తీసుకెళ్లి కోరిక తీర్చుకుని తెచ్చేవారు. వారి చేతిలో రెండేళ్ల పాటు నిత్యం నరకం అనుభవించిన బాధితురాలు చివరికి విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పింది. వారి సాయంతో పోలీసులకు పిర్యాదు చేసింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను కోర్టులో హాజరుపర్చారు. 2015 ఏప్రిల్ నుంచి సాగిన కేసులో న్యాయస్థానం తీర్పు వెలువడింది. నిందితులు, బాధితురాలికి మధ్య జరిగిన వాట్స్ యాప్ సంభాషణనే కోర్టు సాక్ష్యంగా పరిగణిస్తూ, హార్దిక్ సిక్రీ, కరణ్ ఛాబ్రాలకు 20 ఏళ్ల జైలు శిక్ష, మరో విద్యార్థి వికాస్ గార్గ్ కి ఏడేళ్ల జైలు శిక్షను న్యాయమూర్తి విధించారు. వాట్స్ యాప్ సంభాషణలే సాక్ష్యంగా పరిగణిస్తూ.. ఈ కేసులో తన తీర్పును వెలువరిస్తున్నానని కేసును విచారించిన అదనపు సెషన్స్ న్యాయమూర్తి జస్టిస్ సునీతా గ్రోవర్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles