Heavy rains likely in Telugu states in next 3 days, says MeT Dept వార్నింగ్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Heavy rains likely in telangana and andhra pradesh in next 3 days says met dept

heavy rains to telugu states, heavy rains to telangana, weathet bulletin, rain forecast, heavy rains to andhra pradesh, Indian Meteorological Department

The Indian Meteorological Department released a weather bulletin warning Telangana and Andhra Pradesh for heavy to very heavy rainfall.

వార్నింగ్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Posted: 06/06/2017 10:32 AM IST
Heavy rains likely in telangana and andhra pradesh in next 3 days says met dept

తెలుగు రాష్ట్రాలకు పిడుగులాంటి వార్తను వెలువరించింది భారత వాతావరణ శాఖ. భానుడి ప్రచండ ప్రతాపంతో ఉడికిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు సేద తీర్చే కబరు అందుతున్న తరుణంలో సరిగ్గా గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా రుతు పవనాల విస్తరణకు బ్రేక్ పడుతుందని తెలిపింది. వర్షం కోసం ఎదురు చూసే అన్నదాతకు ఈ సారి వర్షాలు సాధారణం కన్నా అధికంగా వున్నాయన్న అంచనాలతో సంతోషపడగా, రుతు పవనాల విస్తరణ సకాలంలో జరుగుతుందా..? వర్షాలు సకాలంలో పడతాయా లేదా..? అన్న అందోళన రైతన్నలో నెలకొంది.

జార్ఖండ్‌ నుంచి ఉత్తరకోస్తా వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం చేత క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడి రానున్న మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో బుధవారం నుంచి మూడు రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. ముఖ్యంగా 7, 8 తేదీల్లో తెలంగాణలో.. 8, 9 తేదీల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. అయితే వర్షాలు లేనిచోట మాత్రం భానుడు తమ ప్రతాపాన్ని చాటే అవకాశముందని తెలిపింది. అప్పుడప్పుడు వర్షాలు కురిసినా పూర్తిస్థాయిలో వాతావరణం చల్లబడదని.. రుతుపవనాలు ప్రవేశించే వరకు రాష్ట్రంలో సాధారణం కంటే అధిక ఎండలు తప్పవని చెప్పారు.

తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే రుతుపవనాలను అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అడ్డుకుంటోందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి వై.కె.రెడ్డి తెలిపారు. మూడు నాలుగు కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉన్న ఆవర్తనం కారణంగా.. నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రంలోనే నిలిచిపోయాయని... అవి ముందుకు కదలడానికి అనువైన వాతావరణం లేదని చెప్పారు. ఉపరితల ఆవర్తనం ఈ నెల 8 నాటికి తగ్గిపోయే అవకాశం ఉందని.. ఆ తర్వాత నైరుతి రుతుపవనాలు బలపడి తెలుగు రాష్ట్రాలకు విస్తరిస్తాయని వెల్లడించారు. ఈ నెల 12 నాటికి తెలంగాణలోకి ప్రవేశించే అవకాశముందని చెప్పారు. సో ఫ్రెండ్స్ బీ కేర్ పుల్.. బయటకు వెళ్లేప్పుడు తప్పనిసరిగా రెయిన్ కోట్స్, లేదా గొడుగులు తీసుకెళ్లండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles