union minister climbs on tree to make a phone call కేంద్రమంత్రి చెట్టెక్కిన తరువాతైనా ఊదరగొట్టడం మానుతారా..?

Union minister climbs on tree to make a phone call

rajasthan minister on tree, arjun ram meghwal, raj minister on tree for call video, union ministerm mobile phone, tree, arjun ram meghwal, rajasthan, digital India, cashless transactions, demonetisation

Minister of State for finance, Arjun Ram Meghwal, on a visit to his constituency in Bikaner’s Dholiya village, where he was trying to address a issue, but couldn’t get through to the officers because of a lack of signal.

కేంద్రమంత్రి చెట్టెక్కిన తరువాతైనా ఊదరగొట్టడం మానుతారా..?

Posted: 06/06/2017 11:46 AM IST
Union minister climbs on tree to make a phone call

డిజిటల్ ఇండియా అంటూ యావత్ ప్రపంచాన్ని మన దేశం అకర్షింస్తుంది. కేంద్రం మేక్ ఇన్ ఇండియా పిలుపుతో.. భారత్ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక సంస్థలు ఇప్పటికే ముందుకు వచ్చాయి. పలు కంపెనీలు తమ ఉత్పత్తులను కూడా ప్రారంభించే స్థాయికి చేరుకున్నాయి. అయితే అనేక కంపెనీలు నగరాలకు శివారల్లో వున్న ప్రాంతాల్లో నెలకొల్పడం చేత వాటికి అసలైన కమ్యూనికేషన్ విభాగం కొంత సమస్యగా మారుతుంది. తమ ఫోన్ సిగెల్స్ అందక.. వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోంటున్నారు. ఇక దీనికి తోడు కేంద్రం తాజాగా ప్రవేశపెట్టిన నగదు రహిత లావాదేవీలపై కూడా జనం పెదవి విరుస్తున్నారు.

పట్టణ ప్రజలు ఫర్వాలేదని కేంద్ర నిర్ణయాన్ని శ్లాఘించి, స్వాగతించినా.. గ్రామీణ భారతంలో మాత్రం ఈ విధమైన సేవలకు అస్సలు సానుకూల పరిస్థితులు లేవు. అందుకు కారణం.. ఈ లావాదేవీలతో తామెక్కడ నష్టపోతామోనన్న అందోళన వారిలో వుంది. తమను దుకాణాదారులు మోసం చేస్తారేమోనన్న భయం వారిలో నెలకొనడమే ఇందుకు కారణం. ఇక నిరక్ష్యరాసత్య కూడా దీనికి మరో కారణంగా నిలుస్తుంది. తమ అధార్ కార్డు నెంబర్ వారికి చెబితే.. దానిని వారు మరోలా వినియోగించుకునే అవకాశం కూడా వుందన్న వార్తలు ప్రచారంలోకి రావడంతో.. అది కూడా వారిని బయపెడుతోంది.

ఇక కాస్తా కూస్తో చదవుకున్న యువత ప్రధాని పిలుపుతో మంచే జరుగుతుందని అశించి.. నగదు రహిత లావాదేవీల వైపు అకర్షితులవుతున్నా తమ మొబైల్ ఫోన్ లో సిగ్నల్స్ సమస్య తీవ్రంగా ఇబ్బంది పెట్టడంతో వారు ఈ లావాదేవీలపైవు విముఖత వ్యక్తం చేస్తున్నారు. పట్టణాలకు దూరంగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్స్ సమస్య మరీ అదికంగా వుంటుంది.  టవర్స్ కు దూరంగా ఉండే మారుమూల గ్రామాల్లో నెట్‌వర్క్ అంతగా ఉండదు. దాంతో జనాలు గుట్టపైనో, చెట్టుపైనో ఎక్కి మాట్లాడుతుంటారు.

సరిగ్గా ఇదే పరిస్థితి కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ కు ఎదురైంది. రాజస్థాన్‌లోని తన నియోజకవర్గంలో పర్యటించిన ఆయనకు ఈ పరిస్థితి ఎదురైంది. దీంతో అయన కూడా ఓ చెట్టుపైకి ఎక్కి ఆ తరువాత ఫోన్ మాట్లాడాల్సి వచ్చింది. ఇది కాస్తా వైరల్ కావడంతో.. ఇప్పటికైనా కేంద్రం దేశవ్యాప్తంగా న్యాణమైన సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ తరువాత డిజిటిల్ ఇండియాపై ప్రచారం చేస్తే బాగుంటుందని నెట్ జనుల నుంచి పలు విమర్శలు వినడడుతున్నాయి. దేశప్రజలపై బలవంతంగా కేంద్రం నిర్ణయాలను రుద్దే బదులు క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించాలని పలువురు సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles