రాను రాను అంటున్న వెయ్యి నోటు.. No plans to re-introduce Rs. 1000 notes: Shaktikanta Das

Govt has no plans to introduce rs1 000 currency notes shaktikanta

new 1000 note, demonetisation, RBI, Shaktikanta Das, finance ministry, arun jaitley, pm modi, mobile, business, fincance

Economic Affairs Secretary Shaktikanta Das made a complete U-turn from his earlier statement and said the government has no plan to introduce new Rs 1000 note.

రూ.వెయ్యి నోట్లపై మరో ట్విస్టు.. దోబుచులాడుతున్నాయా.?

Posted: 02/22/2017 01:30 PM IST
Govt has no plans to introduce rs1 000 currency notes shaktikanta

దేశంలో చలామణిలోకి కొత్తగా ముద్రించిన వెయ్యి నోట్లు వస్తున్నాయన్న కథనాలు దేశవ్యాప్తంగా హల్ చల్ చేయడంతో.. రంగంలోకి దిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ మరో ట్విస్టును ఇచ్చింది. చలామణిలోకి కొత్తగా వెయ్యి నోట్లు తీసుకువస్తున్నట్లు వస్తున్న వార్తలను కొట్టిపారేసిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్.. అసలు కేంద్ర ప్రభుత్వం ముందు అలాంటి ప్రతిపాదన ఏమీ లేదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం రూ.500 నోట్లు, ఇతర చిన్న నోట్లను సరిపడా ముద్రించడం పైనే దృష్టి సారించామని అయన తెలిపారు.

దేశంలోని అవినీతి, నల్లధనాన్ని అణచివేసేందుకు పాత పెద్ద నోట్లు రూ. ఐదు వందలు, వెయి నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ గత ఏడాది నవంబర్ ఎనమిదిన నిర్ణయం తీసుకుని.. వాటిస్థానంలో కొత్తగా రూ. రెండు వేలు, రూ. ఐదు వందల నోట్లను ప్రవేశపెట్టారు. ఇప్పుడు కొత్తగా రూ. వెయ్యి నోట్లను కూడా మళ్లీ ప్రవేశపెట్టే అవకాశముందని.. ఈ మేరకు భారత రిజర్వు బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నాయని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన కేంద్రం అలాంటి ప్రతిపాదన ఏమీ లేదని తేల్చిచెప్పింది.

ఇప్పటికే రూ. వెయ్యినోట్ల ముద్రణ ప్రక్రియను ఆర్బీఐ ప్రారంభించిందని, అయితే ఎప్పటిలోగా మార్కెట్లోకి ఇవి రానున్నాయన్నది కచ్చితంగా తెలియద కేంద్ర ఆర్థికశాఖకు సంబంధించిన ఓ అధికారి తెలిపనట్లుగా కథనాలు రాగా, ఎక్కడా వెయ్యి నోట్ల ముద్రణ జరగడం లేదని శక్తికాంత్ దాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఏటీఎంలలో నగదు కొరత గురించి వస్తున్న ఫిర్యాదులపై ఆయన స్పందించారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో తమకు అవసరమైనంత మేరకే నగదు విత్ డ్రా చేసుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు.

అయితే వెయ్యినోటు కథనాలు ఒకలా, అర్థిక శాఖ కార్యదర్శి మరోలా ప్రకటనలు చేయడంతో.. దేశ ప్రజలతో వెయ్యి నోట్లు దోబుచులాడుతున్నాయన్న నెట్ జనులు కామెంట్లు చేస్తున్నారు. మరికోందరు మాత్రం ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు లేకుండానే నెట్ లో వెయ్యి రూపాయల స్పెసిమెన్ నోట్లు ఎలా హల్ చల్ చేస్తున్నాయని, వాటి రంగు, ఇతర వివరాలు నెట్ జనులకు ఎలా తెలిసాయని కూడా ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : new 1000 note  demonetisation  RBI  Shaktikanta Das  finance ministry  arun jaitley  pm modi  mobile  business  fincance  

Other Articles