డీఎంకే పిటీషన్ పై కొనసాగుతున్న ఉత్కంఠ..! Provide video evidence of ruckus in TN Assembly: Madras HC to DMK

Provide video evidence of ruckus in tn assembly madras hc to dmk

MK Stalin, Election Commission of India, AIADMK, Madras High Court, Palaniswami, P Dhanapal, Tamil Nadu Assembly, late cm J Jayalalithaa, VK Sasikala, disproportionate case, R. Natarajan, Stalin, Bengaluru, O.Panneerselvam, PM modi, Governor, tamil politics

The Madras High Court sought credible video evidence of the proceedings in the Tamil Nadu Assembly during Chief Minister?s Edapadi Palaniswami?' trust vote.

డీఎంకే పిటీషన్ పై కొనసాగుతున్న ఉత్కంఠ..!

Posted: 02/22/2017 03:19 PM IST
Provide video evidence of ruckus in tn assembly madras hc to dmk

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రభుత్వం రాజ్యంగ వ్యతిరేకతకు పాల్పడిందంటూ తక్షణం చర్యలు తీసుకోవాలని పేర్కోంటూ మద్రాసు హైకోర్టును అశ్రయించిన డీఎంకే కార్యనిర్వహాక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కు హైకోర్టు షాక్ష్యాలను కూడా సమర్పించాలని అదేశించింది. ఎలాగైనా పళినిస్వామి ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ప్రతీనబూనినట్లు కనబడుతున్న స్టాలీన్.. అన్నాడీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్రాసు హైకోర్టులో పిటీషన్ వేసిన విషయం తెలిసిందే.

ఈ పిటీషన్ ను విచారణ స్వీకరించిన న్యాయస్థానం తొలుత దానిపై విచారణను బుధవారానికి వాయిదా వేసింది. కాగా ఇవాళ కూడా అ పిటీషన్ పై విచారించిన న్యాయస్థానం.. తమిళనాడు ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేకతకు పాల్పడిందన్నట్లు సాక్ష్యాధారాలు వున్నాయా..? వుంటే వాటిని కూడా సమర్పించండీ అని అదేశించింది. అన్నాడీఎంకే లో పళనిస్వామి ప్రభుత్వానికి మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలు అందరూ కవత్తూర్ లోని గోల్డన్ బే రిసార్టులో వున్నారనడానికి సాక్షాల్యు వున్నాయా..? అని ప్రశ్నించింది. వుంటే వాటిని తమకు సమర్పించాలని అదేశించింది.

దీంతో పాటు తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి పళినిస్వామి విశ్వాస పరీక్షను ఎదుర్కొంటున్న సమయానికి సంబంధించిన వీడియో ప్రొసీడింగ్ లను కూడా కోర్టుకు సమర్పించాలని అదేశించింది. మద్రాసు హైకోర్ుటలో డీఎంకే పార్టీ ఈ రెండు అంశాలకు సంబంధించిన రెండు వేర్వేరు పిటీషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో ఆ రెండింటిపై విచారణ చేపట్టేందుకు వాటికి సంబంధించిన వీడియో అధారాలను కూడా సమర్పించాలని అదేశించింది. ఈ మేరకు డీఎంకే తరపున పిటీషన్లు దాఖలు చేసిన అడ్వకేట్లు బాలును అదేశించింది. ఈ పిటీషన్లపై విచారణ సందర్భంగా అనేక నియమనిబంధనలు పళిని ప్రభుత్వం ఉల్లంఘించిందిని అందుకు సంబంధించి తమ వద్ద ఆధారాలు కూడా వున్నాయిన చెప్పడంతో న్యాయస్థానం వాటిని సమర్పించాలని అదేశించింది. కాగా ఈ పిటీషన్లపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : J Jayalalithaa  VK Sasikala  Palanisamy  Stalin  Madras High Court  AIADMK  Tamil Nadu Assembly  

Other Articles