సరదా కామెంట్ రేపిన రచ్చ.. ఇంతంత కాదయా..! Mumbai police ‘owns’ Shobha De after her ‘misplaced’ tweet

Mumbai police owns shobha de on twitter after her misplaced tweet

columnist Shobha De, BMC polls, fat joke, in-viral, Mumbai Police, fun, Shobhaa De, twitter, mumbai, BMC elections, Entertainment, Lifestyle

Columnist Shobhaa De has once again trolled by netgens, when she made a fat joke about the security cover in Mumbai because of the BMC elections.

‘శోభా డే’స్ బాగాలేవా..? రచ్చ చేపిన సరదా కామెంట్

Posted: 02/22/2017 01:02 PM IST
Mumbai police owns shobha de on twitter after her misplaced tweet

ప్రముఖ జర్నలిస్టు, కాలమిస్టు అయిన శోభా డేకు రోజులు బాగాలేనట్టున్నాయి. అమెకు బ్యాడ్ టైం నడుస్తున్నట్లు వుంది. టైం బాగోలేకపోతే తాడును ముట్టుకున్నా పామై కాటేస్తుందన్న పెద్దల నానుడిని అమె విషయంలో అక్షరాల నిజం అవుతున్నట్లుగా వుంది. రియో ఒలంపిక్స్ లో ప్రతిభ చాటిన భారత్ క్రీడాకారుణులను ఉద్దేశించి గతంలో అమె చేసిన ట్విట్టు అమెను నెట్ జనులు అడిపోసుకునేలా చేశాయి. ఇక ఆ తరువాత సుష్మాస్వారజ్ తో పాటు గా పలు అంశాలపై ట్విట్లు చేసిన అమె పలు పర్యాయాలు భంగపాట్లు తప్పలేదు. ఇలా తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అమె వార్తల్లో నిలిచారు.

ఇక తాజాగా అమె చేసిన లేటెస్టు ట్విట్టు సరదా కోసం చేసిందే అయినా.. అమెను మరోమారు విమర్శల పాలుచేసింది. మంగళవారం ముంబైలో జరిగిన బీఎంసీ ఎన్నికల సందర్భంగా ‘భారీ పోలీసు బందోబస్తు’ అంటూ లావుగా ఉన్న ఓ పోలీసు ఫోటోను ట్విటర్‌లో పోస్టు చేశారు. అధిక బరువున్న ముంబై పోలీసును చూపిస్తూ సరదాగా జోక్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ పోస్టు ముంబై పోలీసులను అవమానించేలా ఉందంటూ ట్విట్టర్లో ఒక్కసారిగా విమర్శలు వెల్లువెత్తాయి. ఇది అసలు ముంబై పోలీసు ఫోటోనే కాదనీ కొందరు..భుజంపై ఉన్న బ్యాడ్జి ఆధారంగా మధ్యప్రదేశ్ పోలీసు కావచ్చునంటూ మరికొందరు కామెంట్ చేశారు.

కాగా ఇంకొందరు నెటిజన్లు మాత్రం ‘‘ముంబై పోలీసులు ఫిట్‌గా ఉండడానికి ప్రయత్నించాలి’’ అంటూ శోభాడేను వెనకేసుకొచ్చారు. అయితే ముంబై పోలీసులు మాత్రం శోభాడేకి ధీటుగా సమాధానం ఇచ్చారు. ఒక బాధ్యత గల వ్యక్తిగా ఆమె నుంచి ఇలాంటివి వినాల్సి రావడం బాధాకరమని ట్వీట్ చేశారు. ‘‘శోభాడే అపహాస్యాలు కూడా మేము ఇష్టంగా స్వీకరించగలం కానీ... ఇది మాత్రం పూర్తిగా తప్పుడు సందేశం ఇచ్చేలా ఉంది. ఆ యూనిఫామ్‌గానీ, ఆ అధికారి గానీ మాకు సంబంధించిన వ్యక్తి కాదు. మీలాంటి బాధ్యతయుతమైన పౌరుల నుంచి ఇంకా మంచి విషయాలు రావాలని ఆశిస్తున్నాం’’ అని ముంబై పోలీసులు ట్విటర్లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BMC polls  fat joke  Mumbai Police  fun  Shobhaa De  twitter  mumbai  

Other Articles