తమిళనాడు ముఖ్యమంత్రిగా పళనిస్వామి.. పన్నీరుకు కన్నీరే..! palanisamy to swear-in as TN CM today,

Palanisamy to swear in as tn cm today

Tamil Nadu, chief minister, late cm J Jayalalithaa, VK Sasikala, disproportionate case, Palanisamy, , Bengaluru, O.Panneerselvam, supreme court, vidyasagar rao, PM modi, Governor, tamil politics

Tamil Nadu Governor Ch Vidyasagar Rao on Thursday invited AIADMK Legislature Party Leader Edapaddi Palanisamy to form the government.

తమిళనాడు సీఎంగా పళనిస్వామి.. పన్నీరుకు కన్నీరే..!

Posted: 02/16/2017 11:39 AM IST
Palanisamy to swear in as tn cm today

రోజుకో మలుపు తిరుగుతూ.. క్షణానికో ట్విస్టులతో, శరవేగంగా మారిన రాజకీయ సమీకరణలతో యావత్ దేశం దృష్టిని అకర్షించిన తమిళనాట రాజకీయంలో ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది. అమ్మ తరువాత చిన్నమే అన్నది పార్టీ ఎమ్మెల్యేలు నిరూపించారు. చిన్నమ్మగా ఖ్యాతిగాంచిన శశికళ ఎట్టకేలకు పంతం రెగ్గించుకుంది. ఇవాళ సాయంత్రం పళనిస్వామి తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరాం చేయనున్నారు. ఆయనను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తమిళనాడు ఇంచార్జ్ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు అహ్వానించారు.

ఈ వార్త తెలియడంతో చెన్నైకి 70 కిలోమీటర్ల దూరంలో వున్న గోల్డన్ బే రిసార్టులో సంబరాలు ప్రారంభమయ్యాయి. రిసార్టులో వున్న 117 మంది ఎమ్మెల్యేలు సంతోషంలో మునిగితేలారు. ఆనందోత్సాహాలతో  సంబరాలు చేసుకున్నారు. కాగా క్రితం రోజు సాయంత్రం గవర్నర్ తో భేటీ అయిన పళనిస్వామి తనకు 124 మంది ఎమ్మెల్యేల మద్దుతు వుందని ప్రకటించడంతో పాటు వారి సంతకాలతో కూడిన లేఖను సమర్పించారు. ఆ తరువాత రాత్రి పన్నీరు సెల్వం బృందం కూడా గవర్నర్ తో భేటీ అయ్యింది. కాగా అయన మరింత సమయం కోరడంతో గవర్నర్ తన నిర్ణయాన్ని తీసుకున్నారు.

పళనిస్వామి లేఖను అధారంగా చేసుకుని ఆయనకు గవర్నర్ విద్యాసాగర్ రావు ముందుగా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించారు. కాగా, పక్షం రోజుల వ్యవధిలో సభలో బలం నిరూపించుకోవాలని అదేశించారు. 1954 మార్చిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన పళనిస్వామి.. 80లలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ముందునుంచి ఆయన అన్నాడీఎంకేలోనే ఉన్నారు. తొలుత జయలలితకు, ఆమె మరణం తర్వాత శశికళకు ఆయన విధేయుడిగా వ్యవహరించారు. సేలం డెయిరీ చైర్మన్ నుంచి మంత్రి వరకు ఎదిగారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అవుతున్నారు. కాగా, పన్నీరు వర్గానికి మాత్రం కన్నీరే మిగిలింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : J Jayalalithaa  VK Sasikala  Palanisamy  panneerselvam  vidyasagar rao  governer  AIADMK  tamilnadu  

Other Articles

Today on Telugu Wishesh