పళనిసామికి గవర్నర్ పిలుపు.. ఎందుకోసమో..? Tamil Nadu Governor Set To Meet AIADMK Leader Palanisamy

Tamil nadu governor set to meet aiadmk leader palanisamy

Tamil Nadu, chief minister, late cm J Jayalalithaa, VK Sasikala, disproportionate case, Palanisamy, , Bengaluru, O.Panneerselvam, supreme court, vidyasagar rao, PM modi, Governor, tamil politics

AIADMK's leader of legislature party Edapadi K Palanisamy will be meeting Tamil Nadu Governor C Vidayasagar Rao, said an official in Raj Bhavan.

పళనిసామికి గవర్నర్ పిలుపు.. ఎందుకోసమో..?

Posted: 02/16/2017 11:09 AM IST
Tamil nadu governor set to meet aiadmk leader palanisamy

అన్నాడీఎంకే నాయకురాలు ఎంకే శశికళ జైలుకెళ్లిన తరువాత తమిళనాట రాజకీయాలు కీలకమలుపులు తిరుగుతున్నాయి. తాజాగా శశికళ వర్గానికి చెందిన పళనిస్వామికి గవర్నర్ నుంచి పిలుపు అందింది. అయనను రాజ్ భవన్ ను రావాల్సిందిగా గవర్నర్ పలిచారు. గవర్నర్ ఉదయం 11.30 గంటలకు అపాయింట్ మెంట్ ఇవ్వడంతో పళని స్వామి, సెంగొట్టయాన్తో పాటు మరో నలుగురు నేతలు రాజ్‌భవన్‌కు బయల్దేరి వెళ్తున్నారు. అయితే పళనిస్వామిని గవర్నర్ ఎందుకు పిలిచారన్న విషయంలో క్లారిటీ మాత్రం భేటి తరువాతే వస్తుంది.

నిన్న సాయంత్రం గవర్నర్ తో భేటీ అయిన ఆయన..తనకు 124 మంది ఎమ్మెల్యేల మద్దతు వుందని లేఖను అందజేశారు. ఈ నేపథ్యంలో ఆయనను బలనిరూపణ చేసుకోమంటారా..? లేక నేరుగా సీఎం ఫీఠాన్ని అందిస్తారా..? అన్న విషయంలో సందిగ్ధత నెలకోంది. దాంతో శశికళ వర్గంలో సంబరాలు ప్రారంభమయ్యాయి. అయితే గవర్నర్ అవకాశం ఇస్తే తాము ఇవాళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్దగా వున్నట్లు పళనిస్వామి ఇప్పటి స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

గవర్నర్ తాజా నిర్ణయం నేపథ్యంలో గత వారం రోజులుగా సంబరాలు చేసుకుంటున్న పన్నీరుసెల్వం వర్గం.. ముఖ్యంగా శశికళకు దేశ సర్వోన్న న్యాయస్థానం శిక్షను ఖారరు చేసి.. తక్షణం లొంగిపోమ్మని అదేశించిన తరువాత మిన్నంటిన సంబరాలతో ఫుల్ జోష్ గా వున్న పన్నీరు వర్గం మాత్రం అందోళనకు గురవుతుంది. పన్నీరు వర్గం వేసిన ఎత్తులన్నీ చిత్తుకావడం.. శశికళ అరెస్టు అయిన అమె వర్గం నుంచి ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో తనకు మద్దతునిస్తారన్న వార్తలన్నీ నిజం కాదని తేలిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : J Jayalalithaa  VK Sasikala  Palanisamy  panneerselvam  vidyasagar rao  governer  AIADMK  tamilnadu  

Other Articles