కేటీఆర్.. భయపెడితే పడరంట.. లాస్ట్ లో ఓ గట్టి పంచ్ | Kodandaram Not Scared for KTR Comments.

Kodandaram strong counter to ktr

TJAC Chairman Kodandaram, Kodandaram KTR, KTR Kodandaram, Kodandaram Telangana Government, K T Rama Rao kodandaram, Kodandaram Warn, KTR Warn Kodandaram, Minister KTR, Professor Kodandaram, Kodandaram Reaction

TJAC leader Kodandaram responded strongly to K T Rama Rao ‘‘the government will crush any such agitation with an iron hand’’ Comments. “Telangana people are not scared of police firing. Had they been really scared, the Telangana state would not have been possible. The statement itself shows the government is planning to order firing to crush the legitimate agitation of youth for jobs,” he added.

కేటీఆర్ వార్నింగ్ కు పవర్ ఫుల్ కౌంటర్

Posted: 02/16/2017 01:20 PM IST
Kodandaram strong counter to ktr

పేరుకు పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ అయినప్పటికీ తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ దానిని వాడుకున్నంతగా మిగతా పార్టీలు వాడుకోలేకపోయాయి. ఆ ఫలితమే కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించినప్పటికీ, క్రెడిట్ ఖాతాలో వేసుకుని అధికారంలోకి వచ్చింది. ప్రోఫెసర్ కోదండరాం లాంటి మచ్చ లేని వ్యక్తి నేతృత్వంలో ఆనాడు ఉద్యమం ఉవ్వెత్తున్న కొనసాగింది. ఇప్పుడు ప్రభుత్వంలో ఈ గులాబీ దళమే అప్పుడు రోడ్డెక్కి రచ్చ చేయటం, విగ్రహాలు కూల్చేసి ట్యాంక్ బండ్ లో పడేయటం, ఓవరాల్ గా లా అండ్ ఆర్డర్ ను అతలాకుతలం చేసింది కూడా.

కాల చక్రం గిర్రున తిరిగి ఇప్పుడు అధికారంలో ఉంది టీఆర్ఎస్. ఉద్యోగాల కోసం వీధుల్లోకి వస్తున్న అదే విద్యార్థులను పవర్ అండతో అదుపు చేస్తోంది. ఒకప్పుడు ఉద్యమంలోకి ఎగిసి పడాలంటూ స్టేట్ మెంట్లు ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లితే సహించేది లేదంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ స్వయంగా ఓ కామెంట్ చేశాడు.

రాజకీయ నిరుద్యోగం ఉన్న కొందరు విద్యార్థులను రెచ్చగొట్టి ఉద్యమాన్ని లేవదీస్తున్నారని, తద్వారా తెలంగాణలో అల్లకల్లోలం రేపుతున్నారంటూ వ్యాఖ్యలు చేశాడు. చివర్లో అలాంటి చేష్టలను చూస్తూ ఊరుకోమని చెబుతూనే ఉక్కు పాదంతో అణచి వేస్తామని ప్రకటించాడు కూడా. సహజంగానే ఇది ప్రోఫెసర్ గారికి మంట తెప్పించింది.

పోలీసుల తుటాలకు కూడా భయపడేది లేదని చెప్పిన ఉద్యోగాల కోసం ఉద్యమిస్తే యువకులను చంపేస్తారా? అని ప్రశ్నించాడు. అంతటితో ఆగకుండా చివరగా ఓ కౌంటర్ ఇచ్చాడు. అలా వణికిపోయి ఉంటే ఈనాడు తెలంగాణ ఇలా సిద్ధించి ఉండేది కాదని... ప్రభుత్వంలో మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండే వారు కాదంటూ కాస్త గట్టి పంచే వేశాడు లేండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Minister KTR  Professor Kodandaram  Warning  

Other Articles