మాదాపూర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని హత్య కలకలం hyderabad techie sunitha mysterious death

Hyderabad techie sunitha mysterious death

monster.com, monster employee sunita, sunita mysterious death, sunita murder, madhapur murder, madhapur police, cyberabad commissionerate, mysterious death investigation, crime

monster.com employee sunita mysterious murder in madhapur, police files case and starts investigation

మాదాపూర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని హత్య కలకలం

Posted: 02/16/2017 11:07 AM IST
Hyderabad techie sunitha mysterious death

నిట్టనిషీధిలో కూడా జనసంచారం వుండే ప్రాంతం ఏదైనా వుందంటే అదే మాదాపూర్. వేలకోద్ది సాఫ్ట్ వేర్ సంస్థలు.. రాత్రింబవళ్లు ఉద్యోగులు సంచరించే మాదాపూర్ లో రాత్రికి, పగలుకు తేడా లేదు. కానీ అలాంటి ప్రాంతంలో దారుణం చోటుచేసుకోవడం కలకలం రేపుతుంది. ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిని దుండగులు దారుణంగా హతమార్చాడం పెను సంచలనంగా మారింది. సాఫ్ట్ వేర్ సంస్థల ఉద్యోగులు నిబ్బరంగా వుండే ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం తోటి హైటెక్ టెక్కల గుండెల్లో అందోళన రేపుతుంది.

మాన్ స్టర్.కామ్‌లో ప‌నిచేస్తోన్న సునీత అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నిన్న ఉద‌యం ఇంటి నుంచి ఆఫీసుకి బ‌య‌లుదేరింది. అయితే, మ‌ళ్లీ సాయంత్రం ఆమె ఇంటికి చేరుకోలేదు. ఇంత‌లో మాదాపూర్‌లో నిర్జన ప్రాంతంలో ఓ మృతదేహాం వుందని పోలీసులకు సమాచారం అందింది. అయితే అమె మృతదేహాన్ని అప్పటికే సగం మేర కాల్చివేశారు దుండగులు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అమె మృత‌దేహాన్ని పరిశీలించి అధారాలు సేకరించారు. వెంటనే సునీత తల్లిదండ్రులను పిలపించారు.

ఆ మృత‌దేహం తమ బిడ్డ సునీత‌దేన‌ని గుర్తించిన కుటుంబ స‌భ్యులు శోకసంధ్రంలో మునిగారు. త‌మ‌కు శత్రువులు లేర‌ని ఆమె కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు. సునీతను దారుణంగా చంపి కాల్చేసిన వారు ఆమెకు తెలిసిన వారేనా? లేక ప్రేమ వ్యవహారమే అమె హత్యకు కారణమా..? లేక గుర్తుతెలియ‌ని దుండ‌గులు ఆమెపై దారుణానికి ఒడిగ‌ట్టారా? అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండ‌గుల కోసం పోలీసులు గాలింపు చ‌ర్యలు ప్రారంభించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sunita  monster.com  mysterious death  madhapur  cyberabad  crime  

Other Articles

Today on Telugu Wishesh