పెళ్లిళ్లలో ఇక చూపించుకుంటామంటే కుదరదు.. 5 లక్షలు దాటిందో... | Bill to be introduced in Parliament to cap wedding expenditure.

Wasteful expenditure in weddings prompts lawmaker for a bill

Lok Sabha Bill, Wasteful Expenditure in Weddings, Ranjeet Ranjan, MP Ranjeet Ranjan, Ranjeet Ranjan Bill, Ranjeet Ranjan Wasteful Expenditure Law, Congress MP Lok Sabha Bill, Indian Lavish Weddings, Indian Traditional Marriage, The Marriages (Compulsory Registration and Prevention of Wasteful Expenditure) Bill 2016, Pappu Yadav Wife, Marriage Tax India, The Marriages Bill 2016

Lok Sabha Bill seeks to limit the number of guests, amount of food served at weddings. Wasteful expenditure and lavish spending in marriages and weddings prompted Congress lawmaker Ranjeet Ranjan to introduce a Bill which seeks to curb show of wealth during such ceremonies.

ఇక పెళ్లి ఖర్చులపై కూడా టాక్స్ కట్టాల్సిందే!

Posted: 02/16/2017 09:56 AM IST
Wasteful expenditure in weddings prompts lawmaker for a bill

పెళ్లంటేనే చుట్టాలు, స్నేహితుల కోలాహలం, పందిళ్లు, భోజనాలు ఇలా సందడి సందడిగా ఉండటం కామన్. జీవితంలో ఒకేసారి జరుపుకునే ఈ వేడుకునే అంగ రంగ వైభవంగా జరుపుకోవాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. కానీ, ఇక పై అలాంటి వాటికి చెక్ పడే పరిస్థితులు రాబోతున్నాయి. వివాహ సమయాల్లో పెరిగిపోతున్న దుబారా ఖర్చులను తగ్గించేందుకు కేంద్రం ఓ సరికొత్త ప్రతిపాదన ముందుకొచ్చింది. అందుకోసం ఓ ప్రత్యేక చట్టం తీసుకురాబోతుంది కూడా.

ఇక నుంచి పెళ్లి ఖర్చు రూ. 5 లక్షలు దాటితే అందులో పదిశాతం ప్రభుత్వానికి పన్నుగా కట్టాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ఎంపీ రంజిత రంజన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన వివాహ బిల్లు-2016లో ఈ మేరకు ఓ ప్రతిపాదన తీసుకొచ్చింది. వివాహాల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేయడంతోపాటు, వృథా ఖర్చును తగ్గించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును ప్రవేటు బిల్లుగా పరిగణించి వచ్చే లోక్‌సభ సమావేశాల్లో చర్చించనున్నారు.

తాజా వివాహబిల్లు ప్రకారం పెళ్లిలో రూ. 5 లక్షలకు మించి ఖర్చు చేయాలనుకునే వారు ముందుగా సంబంధిత ప్రభుత్వ అధికారులకు ఆ విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. ఖర్చు చేయాలనుకున్న మొత్తంలో పదిశాతాన్ని ముందుగానే ప్రభుత్వానికి చెల్లించాలి. ప్రభుత్వ ఖజానాకు ఇలా సమకూరే మొత్తాన్ని సంక్షేమ నిధికి మళ్లిస్తారు.

ఈ సొమ్మును పేద అమ్మాయిల పెళ్లిళ్లకు ఖర్చు చేస్తారు. ఇక పెళ్లి భోజనాల్లోనూ వృథా తగ్గించేందుకు బిల్లులో ప్రతిపాదన చేశారు. పెళ్లిలో కొత్త పోకడల కారణంగా వృథా ఖర్చులు పెరిగిపోతున్నాయని, ఇది పేదలకు మరింత భారంగా మారుతోందని రంజిత రంజన్ పేర్కొన్నారు. పెరిగిపోతున్న ఖర్చును తగ్గించాల్సిన అవసరం ఉందని, పెళ్లి జరిగిన రెండు నెలల్లోగా రిజస్టర్ చేయించాలని ఆమె తెలిపారు. ఇంతకీ ఈవిడగారు ఎవరో కాదు వివాదాస్పద ఎంపీ పప్పు యాదవ్ సతీమణి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MP Ranjeet Ranjan  The Marriages Bill 2016  Expenditure in Weddings  

Other Articles

Today on Telugu Wishesh