శశికళ కాన్వాయ్ పై దాడి.. చిన్నమ్మకు రోజుకు రూ.50.. ఎందుకు? VK Sasikala to earn Rs. 50 daily in Bengaluru court

Vk sasikala to earn rs 50 daily in bengaluru court

Tamil Nadu, chief minister, late cm J Jayalalithaa, VK Sasikala, disproportionate case, Parappana Agrahara court, Bengaluru, O.Panneerselvam, supreme court, vidyasagar rao, PM modi, Governor, tamil politics

Sasikala would earn a daily wage of Rs 50 and Sundays would be working too, say sources. She has been given a TV set, a mattress, and a table fan in the jail.

శశికళ కాన్వాయ్ పై దాడి.. చిన్నమ్మకు రోజుకు రూ.50.. ఎందుకు?

Posted: 02/15/2017 06:18 PM IST
Vk sasikala to earn rs 50 daily in bengaluru court

అన్నాడీఎంకే నాయకురాలు ఎంకే శశికళ కాన్వాయ్‌ పై దాడి జరిగింది. కోర్టులో లొంగిపోయేందుకు చెన్నై నుంచి రోడ్డు మార్గంలో శశికళ బుధవారం సాయంత్రం బెంగళూరు కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె కాన్వాయ్‌ పై దాడికి పాల్పడ్డారు. వీరిపై లాఠీచార్జి చేసి పోలీసులు చెదరగొట్టారు. దీంతో కోర్టు ప్రాంగణంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పన్నీర్‌ సెల్వం వర్గీయులే ఈ దాడికి పాల్పడివుంటారని శశికళ మద్దతుదారులు ఆరోపించారు.

శశికళ రాక ముందే ఆమె భర్త నటరాజన్, లోక్సభ డిప్యూటి స్పీకర్ తంబిదురై జైలు ప్రాంగణానికి చేరుకున్నారు. అన్నా డీఎంకే కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పోలీసులతో అన్నా డీఎంకే కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. చెన్నై నుంచి రోడ్డు మార్గం ద్వారా బయల్దేరిన శశికళ నేరుగా బెంగళూరు పరప్పణ కోర్టుకు చేరుకున్నారు. వారంతా శశికళ రాకకోసం ఎదురుచూశారు. అయితే ఇతరులను కోర్టు ప్రాంగణంలోనికి అనుమతించని పోలీసులు అమె వెంట వచ్చిన వారితో పాటు అమె వర్గీయులను కూడా కొంత దూరాన్నే అడ్డుకున్నారు.

ఇదిలా వుండగా జైలులో శశికళ రోజుకు 50 రూపాయలను అర్జించనున్నారు. కొవ్వెత్తులు, అగరోత్తులు చేస్తున్నందున అమెకు రోజువారీ కూలీగా ఈ మొత్తాన్ని ఇవ్వనున్నారని సమాచారం. కాగా అదివారం రోజున కూడా అమె ఈ పనులను చేయాల్సివుందని తెలుస్తుంది. అమెకు కట్టుకునేందుకు మూడు చీరలను అధికారులు ఇచ్చారు. అమెకు కేటాయించిన జైలు గదిని మరో ఇద్దరు ఖైధీలతో కలసి అమె పంచుకోనున్నారు. కాగా అమెకు టీవీ సెట్, టేబుల్ ఫ్యాన్ తో పాటు పరుపును కూడా జైలు అధికారులు కేటాయించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : J Jayalalithaa  VK Sasikala  Parappana Agrahara court  Bengaluru  AIADMK  

Other Articles