పరప్పణ అగ్రహార కోర్టులో లొంగిపోయిన శశికళ Sasikala is Prisoner No. 10711

Vk sasikala surrenders in bengaluru court

Tamil Nadu, chief minister, late cm J Jayalalithaa, VK Sasikala, disproportionate case, Parappana Agrahara court, Bengaluru, O.Panneerselvam, supreme court, vidyasagar rao, PM modi, Governor, tamil politics

Sasikala has surrendered in Bengaluru a day after being convicted by the Supreme Court in a corruption case. She will be lodged in the Parappana Agrahara Central Jail to serve the remainder of their term.

పరప్పణ అగ్రహార కోర్టులో లొంగిపోయిన శశికళ

Posted: 02/15/2017 05:10 PM IST
Vk sasikala surrenders in bengaluru court

అక్రమాస్తుల కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దోషిగా నిర్ధారించడం, లోంగిపోయేందుకు గడువును కూడా ఇవ్వకుండా తక్షణం లోంగిపోయావాలని అదేశించిన నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ.. చెన్నై నుంచి బెంగళూరులోని పరప్పణ అగ్రహార కోర్టులో లొంగిపోయారు. సరిగ్గా కోర్టు సమయం ముగుస్తుందన్న సమయంలో సాయంత్రం ఐదు గంటల తరువాత అమె జైలులో ఏర్పాటు చేసిన కోర్టు హాలులో న్యాయమూర్తి అశ్ర్థనారాయణ ఎదుట హాజరయ్యారు.

అక్రమాస్థుల కేసులో దోషులుగా తెలిన శశికళ బంధువులు సుధాకరణ్, ఇళయవరసి కూడా కోర్టులో లొంగిపోయారు. న్యాయమూర్తి అశ్వర్థనారాయణ దోషుల వాంగ్మూలాలను నమోదు చేసిన అనంతరం వారికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. ఆ తరువాత వీరిని పరప్పణ అగ్రహార జైలుకు తరలించనున్నారు. కాగా అమెకు జైలు అధికారులు 10711 ఖైదీ నెంబరును కేటాయించారు. కాగా ఇదే కేసులో శిక్ష పడిన ఇళవరసికి 10712, సుధాకరన్ కు 10713 నెంబరును కేటాయించారు.

అదాయానికి మించిన అస్తుల కేసులో దోషులుగా తేలిన నిందితులందరికీ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయస్థానం నాలుగేళ్ల శిక్షను విధించగా, ఆరు నెలల శిక్షాకాలాన్ని గతంలోనే గడిపిన వీరు.. తాజాగా మరో మూడున్నరేళ్ల పాటు జైలు శిక్షను అనుభవించనున్నారు. కాగా తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలని విన్నవించిన చిన్నమ్మ విన్నపాన్ని న్యాయస్థానం తిరస్కరించింది. అమెను ప్రత్యేక ఖైదీగా పరిగణించలేమని, సాధరణ ఖైదీగానే పరిగణిస్తామని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : J Jayalalithaa  VK Sasikala  Parappana Agrahara court  Bengaluru  AIADMK  

Other Articles