హైదరాబాదీ క్రికెటర్.. అంతర్జాతీయంగా అరుదైన ఘనత.. India beat S. Africa in Women's Cricket World Cup qualifier

Mithali raj becomes second women cricketer to score 5 500 runs in odis

mithali raj, mithali raj india, india mithali raj, icc rankings, icc odi rankings, icc womens ranking, cricket news, cricket

Mithali became only the second women to cross 5,500 runs. Charlotte Edward, who tops the list, has 5,992 runs to her name.

హైదరాబాదీ క్రికెటర్.. అంతర్జాతీయంగా అరుదైన ఘనత..

Posted: 02/15/2017 09:27 PM IST
Mithali raj becomes second women cricketer to score 5 500 runs in odis

అంతర్జాతీయ క్రికెట్ లో భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్, హైదరాబాదీ మహిళ మిధాలీ రాజ్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ప్రపంచ కప్ క్వాలిఫయర్ రౌండ్ లో సూపర్ సిక్స్ కు చేరుకున్న భారత జట్టు కొలంబోలో సౌతాఫ్రికాతో తలపడింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. కెప్టెన్ ఇన్సింగ్స్ ఆడిన మిధాలీ రాజ్ (64) అర్థ సెంచరీతో ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఆమె 5,500 పరుగుల మైలురాయి అందుకుంది.

 దీంతో అంతర్జాతీయ మహిళా క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన రెండో మహిళగా ఆమె చరిత్ర పుటలకెక్కింది. ఆమె కంటే ముందు ఇంగ్లండ్ మహిళా జట్టు కెప్టెన్ ఛార్లెట్ ఎడ్వర్డ్స్ (5,992) ముందున్నారు. కాగా, ఆమె 2016 రిటైర్మెంట్ తీసుకున్నారు. ఫాంలో ఉన్న మిథాలీ రాజ్ మరింత కాలం జట్టులో కొనసాగే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఆమె రికార్డును మిధాలీ అధిగమిస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా, ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా జట్టు 49 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 206 విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన సౌతాఫ్రికా జట్టు 46.4 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌట్ అయింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles