Participate in India's development, Sushma Swaraj to diaspora

Ministry of external affairs to diaspora donate connect with your roots

mea, ministry of external affairs, india development foundation, sushma swaraj, india development news, business news, latest news, india news

Sushma Swaraj called upon overseas Indians to send funds under the India Development Foundation (IDF) for projects of their choice.

మరో యూపీఏ కార్యక్రమాన్ని మోడీ సర్కార్ ఓటు..

Posted: 08/28/2016 10:16 AM IST
Ministry of external affairs to diaspora donate connect with your roots

కేంద్రంలో గత కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన పథకానికి ప్రస్తుత నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మద్దతు పలికింది. అధార్ సహా పలు పథకాలకు ఇప్పటికే పూర్తి స్థాయిలో అచరణలోకి తీసుకోచ్చిన మోడీ సర్కార్.. తాజాగా మరో కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తుంది. విదేశాలలో స్థిరపడిన, లేక తాత్కాలికంగా వున్న ఎన్‌ఆర్‌ఐలు తమ కన్నతల్లి లాంటి భారత్ మాతకు, దేశంలోని ప్రజలకు సేవ చేసేందుకు ప్రభత్వం ప్రకటించిన వివిధ పథకాలకు తమ వంతు ఆర్థిక సహాయం చేసేందుకు గాను యూపీఏ ప్రభుత్వం తీసుకోచ్చిన ఐడీఎఫ్ కార్యక్రమానికి ఎన్డీయే ప్రభుత్వం కోనసాగిస్తుంది.

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఐడీఎఫ్ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు విరివిగా పాల్గోనాలని పిలుపునిచ్చారు. భారత్‌లో అమలు చేస్తున్నపలు కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ఎన్ఆర్ఐలు ముందుకు రావాలని విదేశాంగ శాఖ ట్విట్టర్ అకౌంట్‌లో వీడియో పోస్ట్ చేశారు. ఇండియా డెవలప్‌మెంట్ ఫౌండేషన్(ఐడీఎఫ్) కార్యక్రమం కింద ప్రవాస భారతీయులు తమ ఆర్థిక సహాయం అందజేయవచ్చని అమె కోరారు.

వీటిని భారత ప్రభుత్వం అమలు చేస్తున్న క్లీన్ ఇండియా, గంగా నది ప్రక్షాళనతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు ఉపయోగిస్తామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విదేశాల్లో నివసిస్తున్నా పుట్టిన దేశంతో తమ అనుబంధాన్ని కొనసాగించేందుకు ఎన్‌ఐఆర్‌ఐలకు ఇదో చక్కని అవకాశమని ఆమె తెలిపారు. భారత అభివృద్ధిలో తమ వంతుగా పాలుపంచుకునేందుకు చాలామంది ఎన్‌ఆర్‌ఐలు ఎదురుచూస్తున్నారని, అలాంటి వారి కోసమే ఈ ఐడీఎఫ్ కార్యక్రమాన్ని రూపొందించారని సుష్మాస్వరాజ్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sushma Swaraj  diaspora  India Development Foundation  Government schemes  

Other Articles