Haryana MLA pedals about 110 km from his constituency to reach Assembly

Mla pedals 110 km to reach assembly

BJP MLA Pawan Kumar Saini, mla pedalled about 110 kms, mla rides cycle, mla pedals cycle, Ladwa mla cycle ride, mla attends Haryana Assembly on cycle, cycling for better health, cycling for environment protection

Ruling BJP MLA Pawan Kumar Saini pedalled about 110 km to the State Assembly in Chandigarh with a message to take up cycling for better health and protection of the environment.

సైకిలే తన ఆరోగ్య సూత్రమని.. సీక్రెట్ చెప్పిన ఎమ్మెల్యే..

Posted: 08/28/2016 09:34 AM IST
Mla pedals 110 km to reach assembly

తమ డిమాండ్లు లేదా ప్రజా సమస్యల పరిష్కారం కోసం సైకిల్ యాత్ర చేస్తామని ప్రకటించే నాయకులు ఫోటోలకు ఫోజులిచ్చిన తరువాత ఏదో నామమాత్రంగా కొంత దూరం సైకిల్ ను నడిపి అక్కడి నుంచి వారి వాహనాల్లో ఎక్కి వెళ్లడం మనం సర్వసాధారణంగా చూస్తూవుంటాం. కానీ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు ఏకంగా 110 కిలోమీటర్ల మేర సైకిల్ పై వెళ్లిన ఎమ్మెల్యే ఎవరో మీకు తెలుసా..? అదేంటి ప్రజాప్రతినిధి అయ్యివుండి.. సైకిల్ నడుపుతూ ఏకంగా అసెంబ్లీ వరకు వెళ్లారా..? ఇది నిజమేనా అని కూడా పలువురికి సందేహాలు రావచ్చు. కానీ ఇది పక్క నిజం.

ఆయన మరోవరో కాదు హర్యానాకు చెందిన అధికార బీజేపి ఎమ్మెల్యే పవన్ కుమార్ సైనీ. చండీగఢ్‌లో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు పది మంది పార్టీ కార్యకర్తలతో కలసి తొక్కర తొక్కు హైలెస్సా అనుకుంటూ సరదాగా వచ్చేశారు. సైనీ లాడ్వా నుంచి సైకిల్‌పై 8 గంటల్లో చేరుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. ‘సైకిల్ తొక్కండి. ఆరోగ్యంగా ఉండండి. పర్యావరణానికి మేలు చేయండి’ అనే సందేశాన్ని ఆచరించి మరీ చూపారు.

చండీగడ్ లోని హరియానా శాసనసభకు చేరుకున్న సైనీని.. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. తాను ఎమ్మెల్యేనని అందులోనూ అధికార పార్టీకి చెందినవాడినని చెప్పడంతో అయనను అనుమతిచ్చారు. తక్కువ దూరాలకు ఇప్పటికీ సైకిల్ వాడతానని ఇదే తన ఆరోగ్య రహస్యమని ఆయన చెప్పారు. ఇవే కాదండోయ్ అక్కడి యువత, చిన్నారులకి సైతం సైక్లింగ్ చేయమని సలహానిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles