Man apologizes to Verizon staff during robbery

Man apologizes to verizon staff during robbery

Man apologizes to Verizon staff during robbery, Gwinnett County police, spray, cellphone store employees, duct tape, 65 smartphones, tablets, other mobile devices, thief, apology, Verizon staff, robbery, Centerville Highway,

Gwinnett County police are looking for two men who sprayed two cellphone store employees with mace, bound them with duct tape, and robbed the store of 65 smartphones, tablets and other mobile devices. registered case and investigating

దొంగతనం చేస్తూ.. క్షమాపణలు చెప్పారు..

Posted: 05/24/2016 11:57 AM IST
Man apologizes to verizon staff during robbery

దోపిడి చేయడం నేరమని తెలిసి కూడా అలా చేసిన దొంగలు.. దుకాణాన్ని మొత్తం ఊడ్చేసి.. ఆనక క్షమాపణలు చెప్పిన వింత ఘటన ఇది. ఇప్పుడు వీరి కోసం గ్విన్నెట్ కౌంటీ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. సెల్ ఫోన్ షో రూంలోకి చోరబడిని ఇద్దరు దొంగలు అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులపై స్ప్రే ప్రయోగించి వారిని డక్ట్ టేపుతో కట్టేసి దుకాణంలోని 65 స్మార్ట్ ఫోన్లను, ట్యాబెట్లను, ఇతర మొబైల్ పరికరాలను ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో ఒక దోంగ కట్టిపడేసిన ఉద్యోగులకు క్షమాపణలు చెప్పాడు.

అట్లాంటా లోని గ్విన్నెట్ కౌంటీ పరిధిలో ఈ ఘటన జరిగింది. అక్కడి పోలీసులు అందించిన సమాచారం మేరకు వివరాలు ఇలా వున్నాయి. ఇవాళ ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఇద్దరు దొంగలు నల్లని బేస్ బాల్ టోపీలు ధరంచి, ముఖానికి నల్లని ఫేస్ పెయింట్ వేసుకుని.. సెంటర్ విల్లా హైవేలో వున్న వెరిజోనా వైర్ లెస్ స్టోర్ లోకి ప్రవేశించారు. ఆ ఇద్దరిలో ఒకతను ముందుగా అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల వద్దకు వెళ్లి.. మేము మీకు హాని తలపెట్టదలచుకోలేదు. మాకు కేవలం సెల్ ఫోన్లు మాత్రమే కావాలని చెప్పాడు.

దొంగ మాటలు విన్న ఉద్యోగులు తమ సేఫ్ లోంచి సెల్ ఫోన్లు తీస్తున్న క్రమంలోనే మరో దొంగ వచ్చి ఏకంగా వారి ముఖంపై స్ప్రే చల్లాడు. ఇంతలొ మొదటి దొంగ, రెండో దొంగను వారించాడు. వారిపై స్ర్పే ఎందుకు చల్లావని నిలదీశాడు. తన తప్పిదాన్ని అంగీకరించిన రెండో దొంగ ఉద్యోగులకు క్షమాపణ చెప్పి.. వారిని కళ్లు కడుక్కోవాల్సిందిగా కోరాడు. ఆ తరువాత వారిద్దరినీ డక్ట్ టేపుతో కట్టిపడేసి షో రూమ్ లోని ఒక మూలన పడేశాడు. ఆ తరువాత దొంగలు తమ పని తాము కానిచ్చి వెళ్లారు.

ఈ మొత్తం తతంగం షోరూంలోని సిసిటీవీల్లో నిక్షిప్తమైంది. దీనిని అధారంగా చేసుకోవడంతో పాటు ఉద్యోగులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు పలు వివరాలను రాబట్టారు. ముందుగా తమ వద్దకు వచ్చిన దొంగ సుమారుగా ఆరు అడుగుల ఎత్తు వుండగా, అతను నల్లని బనియన్ లాంటి టీషర్టు, గ్రే కలర్ జీన్స్ ఫ్యాంటు ధరించగా, రెండో దొంగ 5 అడుగుల  7అంగుళాల వున్నాడని అతను నల్లని జీన్స్ తో పాటు నల్లని జిప్ అప్ హుండ్లీ ధరించాడని.. వారిద్దరి వయస్సు సుమారుగా 20 నుంచి 23 ఏళ్ల లోపు వారైవుంటారని పోలీసులు తెలిపారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : thief  apology  Verizon staff  robbery  Gwinnett County police  

Other Articles