Karnataka mob thrashes UP man for misbehaving with woman

Mob thrashes up man for misbehaving with woman

Bengaluru, mob justice, eve teasing, uttar pradesh man, karnataka, mistook girl as prostitute, mob thrashes man, Karnataka, misbehaving with woman, crime,

A man hailing from Uttar Pradesh was thrashed by a mob in Mangalore for asking sexual favours from a woman standing at a bus stand.

యువతిని వస్తావా.. అని అడిగాడు...

Posted: 05/24/2016 12:35 PM IST
Mob thrashes up man for misbehaving with woman

మహిళలను విలాస వస్తువుగా పరిగణించి.. ఆడలాడే అకతాయికి తగిన శాస్తి జరిగింది. ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని స్థానికులు దేహశుధ్ది చేశారు. అంత జరగినా అతగాడు.. అమె వ్యభిచారిని అని పొరబడ్డానని చెప్పడం కొసమెరుపు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని మంగళూరులో.. స్థానికంగా ఉద్యోగం చేసే యువతి.. యధావిధిగా బస్సుకోసం నిల్చుంది. అయితే సిటీ బస్‌ స్టేషన్‌ వద్ద ఒంటరిగా వున్నా మహిళను చూసిన అకతాయి అమెకు డబ్బులు చూపించి సైగలు చేశాడు.

అకతాయి అసభ్య ప్రవర్తనతో చిర్రెత్తిన మహిళ ఏంటని ప్రశ్నించింది. అతడు నేరుగా వస్తావా..? అని అడిగాడు.. అంతే తనలోని కోపం కట్టలు తెంచుకోవడంతో అమె ఏకంగా వాడిపై తిరగబడింది. తనపట్ల అతను అసభ్యంగా ప్రవర్తించడాన్ని నిలదీసింది. దీంతో నలుగురు గూమిగుడి అతడిని చితకబాదారు. అనంతరం పోలీసులు జోక్యం చేసుకొని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచారం చేసే మహిళగా భావించి తాను అలా అడిగానని నిందితుడు పోలీసులకు చెప్పాడు. అతనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతడిని ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు నిందితుడి పూర్తి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bengaluru  mob justice  eve teasing  uttar pradesh man  karnataka  

Other Articles