స్మార్ట్సిటీగా వరంగల్ | Warangal as smart city

Warangal as smart city

Smart Cities, Warangal, Telangana, Smart City Warangal, వరంగల్, స్మార్ట్ సిటీ

Central Minister Venkaiah Naidu announce Smart cities list. Warangal city got place in smart cties.

స్మార్ట్సిటీగా వరంగల్

Posted: 05/24/2016 12:32 PM IST
Warangal as smart city

తాజాగా కేంద్రం ప్రకటించిన స్మార్ట్ సిటీల జాబితాలో తెలంగాణకు చెందిన వరంగల్ స్థానం సంపాదించింది. తొలి దశలో నిరాశ ఎదురైనా.. రెండో జాబితాలో చేర్చింది కేంద్రం. ఇవాళ 13 నగరాలను స్మార్ట్ సిటీల జాబితాను ప్రకటించారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు. తెలంగాణలో వరంగల్‌కు ఆకర్షణీయ నగరాల జాబితాలో చోటు దక్కిందని తెలిపారు. ఆకర్షణీయ నగరాల జాబితాలో చోటు కల్పించాలని పలువురు సీఎంలు కోరారని… వాటిని అభివృద్ధి చేసి పోటీలో నిలపాలని వారికి సూచించినట్టు తెలిపారు వెంకయ్య. ఈ ఏడాది మరో 7 రాజధానులకు అవకాశం కల్పిస్తామన్నారాయన. ఆకర్షణీయ నగరాల జాబితాలో పాట్నా, సిమ్లా, నయా రాయ్‌పూర్, అమరావతి, బెంగుళూరు, తిరువనంతపురం, ఈటానగర్ పోటీలో ఉన్నాయన్నారు.

స్మార్ట్ సిటీలు ఇవే..
1లక్నో
2వరంగల్
3.ధర్మశాల
4.ఛండీఘర్
5.రాయ్ పూర్
6.న్యూ.టౌన్
7.భాగల్ పూర్
8.పానాజీ
9.పోర్ట్ బ్లేయర్
10.ఇంఫాల్
11.రాంచీ
12.అగర్తలా
13.ఫరీదాబాద్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles