Kabali's Telugu release a doubt?

Rajini s kabali may not have a telugu release

Kochadaiiyaan, Rajinikanth, Kabali, Telugu, Tamil, Rajinikanth, Vikramasimha, Radhika Apte, bollywood, kollywood, Tollywood, radhika nude, radhika topless, radhika cleavage, radhika sensuous look, radhika hot photo shoot, radhika braless photo shoot

Rajini movies have quite a huge fan following in Telugu, a release in the industry would not be easy now as a complaint on his earlier movie

ITEMVIDEOS: కబాలి ముందు కాలర్ ఎగురవేస్తున్న 'కొచ్చాడయన్‌'

Posted: 05/04/2016 07:18 PM IST
Rajini s kabali may not have a telugu release

తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఆయన కూతురు నిర్మించిన కోచ్చాడియన్ సినిమా తాలుకు కష్టాలు ఇప్పుడప్పుడే తొలగిపోయేట్లు లేవు. దీంతో త్వరలో సినిమా థీయేటర్లలో సందడి చేయనున్న ఆయన తాజా చిత్రం కబాలికి కూడా ఇబ్బందులు వెన్నాడుతున్నాయి. త్వరలో విడుదల కాబోతున్న ఈ చిత్రం తెలుగువరాష్ట్రాలలో మాత్రం విడుదల కావడం లేదు. తెలుగు రాష్ట్రాలలో కూడా భారీగా రజనీ అభిమానులకు ఇది మింగుడు పడని వార్తే.

అదేంటి.. అలా ఎందుకు అంటారా..?  వృద్ధ మాఫియా డాన్‌గా తనదైన స్టైల్‌తో, స్టామినాతో రజనీ 'కబాలి'గా విడుదలైన టీజర్‌ యుట్యూబ్‌లో సంచనాలు సృష్టిస్తోన్న కబాలి తెలుగులో ఎందుకు విడుదల కావడం లేదు. తెలుసుకోవాలని వుందా..? ఈ చిత్రానికి కొచ్చాడియన్ చిత్రానికి లింక్ ఏంటి అంటారా..? అయినా ఆ సినిమా నిర్మాత దర్శకులు వేరు, ఈ చిత్రానికి నిర్మాత, దర్శకులు వేరు కదా..? అయినా దీనికి దానికి సంబంధమేంటి..? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలని వుందా..?

భారత తొలి ఫొటో రియలిస్టిక్‌ సినిమా రూపొందిన 'కొచ్చాడయన్‌' పరాజయం ఇంకా రజనీని వెంటాడుతూనే ఉంది. రజనీ కూతురు సౌందర్య రజనీకాంత్ దర్శకురాలిగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో 'విక్రమసింహ'గా విడుదలైంది. రజనీ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమా తెలుగు హక్కులను లక్ష్మిగణపతి ఫిలింస్‌కు చెందిన శోభన్‌ బాబు భారీ ధరకు కొనుగోలు చేశారు. ఈ సినిమా మెగా అట్టర్‌ ప్లాప్‌ కావడంతో తీవ్రంగా నష్టపోయిన డిస్టిబ్యూటర్స్ తెలుగు ఫిలిం చాంబర్‌ ఆఫ్ కామర్స్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ సినిమా ఒకవేళ ప్లాప్‌ అయితే, రూ. 7 కోట్లు పరిహారంగా ఇస్తానని ఒప్పుకున్నారని,  కానీ ఈ సినిమాతో తాము భారీగా మునిగినా గ్యారెంటీగా పేర్కొన్న రూ. 7 కోట్లు ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఈ నేపథ్యంలో తమ గ్యారెంటీ సొమ్ము తిరిగిచ్చేవరకు తెలుగులో ఈ సినిమా విడుదలను ఆపేయాలని నష్టపోయిన డిస్టిబ్యూటర్లు భావిస్తున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. దీంతో వచ్చే జూన్‌లో తెలుగులో ఈ సినిమా విడుదల సందేహామేనని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kabali  rajinikanth  kabali teaser  telugu release  Kochadaiiyaan  

Other Articles