Uttar Pradesh: SP sacks Ram Pal, his Sitapur hotel also razed

Hotel building collapses within minutes

Hotel sparsh, Building, Collapses, Uttar Pradesh, Sitapur, Samajwadi Party, Mobile phone, hotel building, samajwadi mla, sp mla rampal yadav, mla rampal yadav building

A hotel building turned into debris within minutes in Uttar Pradesh's Sitapur district. Hotel Sparsh, owned by SP MLA Rampal Yadav, was mowed down as the building was illegally constructed.

ITEMVIDEOS: కళ్లెదుటే హోటల్ స్పర్శ్ కుప్పకూలింది..

Posted: 05/04/2016 06:34 PM IST
Hotel building collapses within minutes

అది ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేకు చెందిన రెండు అంతస్తుల భవనం. నిన్నమొన్నటిదాక దానిని హోటల్‌గా వినియోగించారు. అయితే అది అక్రమ నిర్మాణమని, అధికార పక్షం తమ శాసనసభ్యులతో అక్రమ నిర్మానాలను కట్టిస్తుందని అరోపణలు రావడంతో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాంపాల్ యాదవ్ ను సస్పెండ్ చేయడంతో పాటు ఆయన అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని ప్రభుత్వం, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అదేశాలు జారీ చేశారు. దాంతో ఎమ్మెల్యేకు చెందిన స్పర్శ్ హోటల్ కూల్చివేసేందుకు రంగంలోకి దిగిన అధికారులు భవనాన్ని కూల్చడానికి చర్యలు చేపట్టారు.

రంగంలోకి జేసీబీలను దింపి కూలగొట్టాలని నిర్ణయించారు. అలా కొంతమేరకు కూలగొట్టారు కూడా. అంతలోనే ఆ భవనం అకస్మాత్తుగా కుప్పకూలింది, కొంతమంది జనం ఆ భవనం సమీపంలో తచ్చాడుతూనే ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా ఈ రెండంతస్తుల బంగ్లా నేలకూలి శిథిలాల కుప్పగా మారింది. అనూహ్యరీతిలో రెప్పపాటులో భవనం కూలి.. దుమ్ము రేగింది. ఇలా కూలుతుందని దానికి చేరువగా ఉన్నవారు అనుకొని ఉండరు. ఒక్కసారి పెళపెళరావాలు చేస్తూ అది కూలడంతో అక్కడున్న వారు భయంతో కేకలు పెడుతూ పరిగెత్తారు.

జాగ్రత్తగా ఉండటం వల్ల అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో ఈ ఘటన జరిగింది. రెండతస్తుల ఓ హోటల్ భవనం చూస్తుండగానే నాటకీయరీతిలో కూలి శిథిలాలుగా మారింది. అయితే ఎమ్మెల్యే రాంపాల్ యాదవ్ కు చెందని భవనం కూల్చివేతను అక్కడి స్థానికులు తమ సెల్ ఫోన్లలో బందించే ప్రయత్నం చేయడంతో ఈ కుప్పకూలిన ఘటన మొత్తం అందులో రికార్డయ్యింది, దీనిని కొందరు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా హల్ చల్ చేస్తుంది, కాగా నిర్మాణంలో కూడా లోపాలు వున్నందనే భవనం ఇలా కుప్పకూలిందన్న అరోపణలు కూడా తెరపైకి వస్తున్నాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rampal yadav  illegal construction  building demolished  collapses  viral video  

Other Articles