AP on fire for special status

Ap on fire for special status

Special Status, AP, Parliament, Andhra Pradesh, Modi, మోదీ, ఏపి, స్సెషల్ స్టేటస్, ఏపి

State of Andhra pradesh set fire through Parliament statements. Central Ministet Jayadev gave clearity on Special Status to AP.

రాజుకున్న ఏపి.. ఉద్యమం షురూ

Posted: 05/05/2016 08:42 AM IST
Ap on fire for special status

ప్రత్యేక హోదా పై కేంద్రం చేతులెత్తేయడంతో ఏపీలో రాజకీయ పార్టీలు భగ్గుమంటున్నాయి. పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధాని ఇచ్చిన హామీని అమలు చేయాలన్న డిమాండతో ఆందోళనకు సిద్దమయ్యాయి. ఇవాళ్టి నుంచి కాంగెస్, తోపాటు సీపీఐ నిరసన బాట పట్టనున్నాయి. విపక్షాల పోరు బాటతో ఏపీలో ప్రత్యేక హోదా సెగలు రాజుకున్నాయి. కేంద్ర మంత్రులు స్పష్టంగా చెబుతున్నా రాష్ట్రకేబినెట్ లోఉన్న బీజేపీ మంత్రుల్లో మాత్రం భిన్నంగామాట్లాడుతున్నారు. టీడీపీ నేతలు మాత్రం ఈవ్యవహారాన్ని చంద్రబాబే డీల్ చేస్తారని అంటున్నారు.

ఏపీ ఆశలపైనీళ్లు చల్లుతూ ప్రత్యేక హోదా అవసరం లేదని పార్లమెంటు సాక్షిగా కేంద్రం ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. విభజన హామీల విషయంలో ఎన్డీయే వైఖరిని నిలదీసేందుకు రాజకీయ పార్టీలు సమరశంఖం మోగించాయి. ఏపీ కాంగ్రెస్ ఆందోళన బాట పట్టనుంది. హైదరాబాద్ గాంధీభవన్ ముందున్న గాంధీ విగ్రహం ముందు ధర్నా చేయనుంది. అక్కడే పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనుంది. అటు వామపక్షాలు కేంద్రం ప్రకటనపై మండిపడుతున్నాయి. నీతి అయోగ్ నివేదక ఆధారంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నామని చెప్పడాన్ని విమర్శిస్తున్నాయి. ప్రత్యేక హోదా తెస్తామని హామీ ఇచ్చిన టీడీపీ ఇచ్చిన మాట కోసం కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడాలని సీపీఎం డిమాండ్ చేస్తోంది.

ఏపీకి హోదా హుష్ కాకి అన్నట్టు కేంద్ర మంత్రులే పార్లమెంటు సాక్షిగా చెబుతున్నా రాష్ట్రకేబినెట్ లో ఉన్న బీజేపీ మంత్రుల్లో మాత్రం ఆశలు చావలేదు. విభజన చట్టంలోని హామీల్ని నెరవేర్చేందుకు కేంద్రం చిత్తశుద్దితో ఉందంటున్నారు దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు. కేవలం సాంకేతిక పరమైన సమస్యల వల్లే హోదాపై స్పష్టత రావడం లేదన్నారు. రాష్ట్రానికి నిధులు ఇస్తున్నట్టుగానే ప్రత్యేక హోదా కూడా ఇస్తుందన్న భరోసాను కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles