6Lakh Harley taken for a test drive, stolen

Rich look youth rode away with his test drive bike

6Lakh Harley davidson bike stolen, 6 lakh bike stolen in hyderabad, Jubilee Hills, Harley Davidson, Banjara Hills, nagarjuna circle, 6Lakh Harley taken for a test drive stolen, Banjara Hills police, karimnagar, toll gates alerted

Posing as a great lover of motorsports with a deep passion for Harley Davidson motorbikes, a man strode into a posh Banjara Hills showroom on Tuesday and rode away with his 'test drive' bike, right in front of a bewildered staff.

టెస్ట్ డ్రైవ్ చేస్తానంటూ.. బురిడీ.. హార్లీ డేవిడ్‌సన్‌తో పరారీ..

Posted: 09/02/2015 08:35 AM IST
Rich look youth rode away with his test drive bike

పైన దగా, కింద దగా, కుడి ఎడమల దగా, దగా, అన్ని మహా కవి శ్రీరంగం శ్రీనివాసులు అన్నట్లు.. నగరంలో రోజుకో వేషంతో, ఏదో ఒక రూపంలో దగా మోసాలు జరుగుతూనే వున్నాయి. చూడగానే ఆకట్టుకునే ఆహార్యంతో.. స్టైలిష్‌ దుస్తులు ధరించి.. ధనవంతుడిలా పోజు కొడుతూ.. అదే స్తాయిలో భారీగా మోసానికి తెరలేపి.. నమ్మిన వారిని కుచ్చుటోపి పెట్టాడు ఓ ఘనుడు. హైదరాబాద్‌ నగరంలలో ఆ కేటుగాడు చేసిన మోసం నుంచి తేరుకున్న షోరూం సిబ్బంది.. తాము మోసపోయామని తెలుసుకుని లబోదిబోమన్నారు.

వివరాల్లోకి వెళ్తే..బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 2 సాగర్‌ సొసైటీ చౌరస్తాలో ఖరీదైన హార్లీ డేవిడ్‌సన్‌ బైకుల షోరూంకు క్రితం రోజు సాయంత్రం రిచ్ లుక్ తో ఓ యువకుడు వచ్చాడు. తన పేరు సయ్యద్‌ తాహెర్‌ అని చెప్పాడు. తాను జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 23లో నివాసం ఉంటానని పరిచయం చేసుకున్నాడు. తానొక ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినని.. నెలకు రూ.1.5 లక్షల జీతం వస్తుందని నమ్మబలికాడు. ఓ ఖరీదైన బైకు కొనడానికి వచ్చానని చెప్పాడు. చూడడానికి యువకుడు టిప్‌టాప్‌గా, ధనవంతుడి మాదిరిగా కనిపించడంతో షోరూం నిర్వాహకులు స్ట్రీట్‌-750 మోడల్‌ వాహనాన్ని చూపించారు. ఆ బైక్‌ ఖరీదు రూ.6 లక్షలని చెప్పారు.

తన వద్ద క్రెడిట్‌ కార్డులు ఉన్నాయని కొంత అందులో నుంచి తీసుకొని మిగతాది ఫైనాన్స్‌ చేయాలని తాహెర్‌ కోరడంతో షోరూం నిర్వాహకులు అంగీకరించారు. అనంతరం అతడు.. ట్రయల్‌ రన్‌ వేసి చూస్తానని బైకును తీసుకొని బయటకు వచ్చి నాగార్జున సర్కిల్‌ వైపు వెళ్లాడు. ఐదు నిమిషాలు గడిచాయి.. పది నిమిషాలు.. అరగంట.. గంట.. మూడుగంటలు.. ఇలా ఎంత సేపు గడిచినా అతడు తిరిగి రాకపోవడంతో తాము మోసపోయామని సిబ్బందికి అర్థమైంది. అతని జాడ కోసం వెతికినా కనిపించకపోవడంతో.. అతడు బైక్‌తోసహా పారిపోయినట్టు షోరూం మేనేజర్‌ షీలా బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు షోరూంకు చేరుకొని అక్కడ సీసీ పుటేజీని పరిశీలిస్తున్నారు. కాగా.. అతడు రెండు చోట్ల పెట్రోల్‌ పోయించుకుని కరీంనగర్‌ వైపుగా ఉడాయించినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఆ దారిలో టోల్‌గేట్ల సిబ్బందిని అప్రమత్తం చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jubilee Hills  Harley Davidson  Banjara Hills  

Other Articles