Biggest strike ever? 'Bharat Bandh' today, India braces for protest by trade unions

Bharat bandh call by ten unions today govt expects minimal impact

bharat bandh, bandh, nationwide strike, india band, india close, Central trade union strike, Trade union, labour law, nationwide strike, union strike, strike, latest news

Essential services like banking and public transport may be impacted today with ten central trade unions going ahead with their one-day nationwide strike.

దేశవ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతున్న భారత్ బంద్

Posted: 09/02/2015 08:09 AM IST
Bharat bandh call by ten unions today govt expects minimal impact

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జాతీయ రహదారి భద్రతా బిల్లుకు వ్యతిరేకంగా ఆటో యూనియన్‌లు పిలుపు మేరకు దేశ వ్యాప్త బంద్‌కు విజయవంతంగా కోనసాగుతోంది. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ర్టాల్లో సార్వత్రిక సమ్మె, బంద్ కొనసాగుతుంది. రహదారి రవాణా భద్రత బిల్లును ఉపసంహరించుకోవాలని, కనీస వేతనాన్ని రూ.15 వేలకు పెంచాలని డిమాండు చేస్తూ పలు సంఘాలు రవాణా బంద్‌ చేపట్టాయి. రైల్వేలో ఎఫ్‌డీఐలను వ్యతిరేకిస్తూ కేంద్రప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాల్లో రవాణ బంద్‌ సాగుతొంది.

గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ బస్సులతోపాటు ఆటోలు, క్యాబ్‌లు, ప్రైవేటు బస్సులు, లారీలు నిలిచిపోనున్నాయి. ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్లు, కండక్టర్లు బంద్‌కు మద్దతుగా విధులకు వెళ్లడం లేదు. గ్రేటర్‌ పరిధిలో 3500 ఆర్టీసీ బస్సులు, 1.30 లక్షలకు పైగా ఉన్న ఆటో రిక్షాలు నిలిచిపోనున్నాయి. కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించే సార్వత్రిక సమ్మెలో ఆర్టీసీ హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, రంగారెడ్డి రీజియన్‌లకు చెందిన బస్సులు దాదాపుగా నిలిచిపోనున్నాయి. సమ్మెకు ఆర్టీసీ టీఎంయూ, ఎన్‌ఎంయూ, ఈయూలు ఇప్పటికే మద్దతు తెలపడంతోపాటు కార్మికులు సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చాయి.

ఇవాళ తెల్లవారు జామునుంచే సిటీ బస్సులు, జిల్లాలకు వెళ్లాల్సిన బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ రీజియన్‌లకు చెందిన సిటీ బస్సులతోపాటు రంగారెడ్డి రీజియన్‌కు చెందిన సుమారు ఆరువందల జిల్లా బస్సులు నిలిచిపోతాయని తెలిపారు. బంద్ ను జయప్రదం చేయాలని కోరుతూ ఆటోయూనిన్లు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్కు వరకు ర్యాలీ నిర్వహించేందుకు ఆటో డ్రైవర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. బంద్‌లో పాల్గొనాలని అన్ని ఆటో సంఘాల మద్దతు కూడగట్టామని వారు తెలిపారు.

సార్వత్రిక సమ్మె ప్రభావంతో రెండు తెలుగు రాష్ర్టాల్లోని పలు జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. పలు జిల్లాల్లో కార్మికసంఘాల నేతలు ర్యాలీలు జరిపారు. నల్గొండ జిల్లాలో సమ్మె ప్రభావంతో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. భువనగిరి పారిశ్రామికవాడలోనూ బంద్‌ కొనసాగుతుంది. ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ డిపోల ఎదుట కార్మికులు ఆందోళన చేశారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆరు డిపోల్లో 600 బస్సులు నిలిచిపోయాయి.

సింగరేణి కార్మికులు సైతం సమ్మెలో పాల్గొనడంతో బొగ్గు ఉత్పత్తి నిలచిపోయింది. మెదక్‌ జిల్లాలో వామపక్షాల కార్యకర్తలు ఆందోళన చేపట్టాయి. ఆర్టీసీబస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కరీంనగర్‌ జిల్లా గోదావరిఖనిలోని పది భూగర్భ గనులు, నాలుగు ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి నిలచిపోయింది. సిద్దిపేట ఆర్టీసీ డిపో ఎదుట సీఐటీయూ నాయకులు బైఠాయించారు. చిత్తూరు జిల్లాలోనూ ఆర్టీసీబస్సుల రాకపోకలు నిలచిపోయాయి. వరంగల్‌ జిల్లాలో 9 ఆర్టీసీ డిపోల్లో వెయ్యి బస్సులు ఆగిపోయాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bharat Bandh  strike  Central trade union strike  Trade union  labour law  nationwide strike  

Other Articles