SC refers 1993 Mumbai blasts convict Yakub Memon's plea against death warrant to larger bench

Supreme court refers yakub memon s plea to larger bench

Supreme Court refers Yakub Memon's plea to larger bench, 1993 mumbai blasts, curative petition, death penalty, supreme court, 1993 Mumbai serial blasts convict Yakub Memon, Yakub Memon, salman khan on memon, Yakub Memon's plea against his death sentence, 30 july Yakub Memon death sentence

The Supreme Court on Tuesday referred 1993 Mumbai serial blasts convict Yakub Memon's plea against his death sentence to a larger bench.

త్రిసభ్య బెంచ్ కు యాకూబ్ మెమెన్ క్షమాబిక్ష పిటీషన్..

Posted: 07/28/2015 05:14 PM IST
Supreme court refers yakub memon s plea to larger bench

1993 ముంబై పేలుళ్ల కేసులో నిందితుడు యాకూబ్‌ మెమెన్‌ క్షమాబిక్ష పిటీషన్ ను దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేసింది. యాకూబ్ మెమెన్ దాఖలు చేసుకున్న క్షమాబిక్ష పిటీషన్పై ఇవాళ విచారించిన అత్యున్నత న్యాయస్థానం ద్విసభ్య ధర్మాసనంలో ఇరువురు న్యాయమూర్తుల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఈ పిటీషన్ ను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనానికి బదలాయిందిచింది. 1993 ముంబై పేలుళ్ల కేసులో నిందితుడు యాకూబ్‌ మెమెన్‌ దోషిగా తేలడంతో ఆయనకు ఈ నెల 30న ఉరి శిక్ష విధించాలని ఇప్పటికే న్యాయస్థానం తీర్పును వెలువరించింది.

ఈ నేపథ్యంలో తనకు ఉరిశిక్ష నుంచి ఉపశమనాన్ని కల్పించాలని.. తనకు జీవిత ఖైదుగా శిక్షను విధించాలని యాకూబ్ మెమెన్ దాఖలు చేసుకున్న క్షమాబిక్ష పిటీషన్ పై ఇవాళ విచారించిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయడంతో.. పిటిషన్‌ను మూడో బెంచ్‌కు బదలాయించారు. జస్టిస్‌ దవే ఉరి శిక్ష అమలు చేయాలని చెప్పగా... జస్టిస్‌ కురియర్‌ మాత్రం ఉరి శిక్ష అమలు చేయవద్దని తెలిపారు. దీంతో త్రిసభ్య ధర్మాసనం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకోంది. యాకూబ్‌ మెమెన్‌ పిటిషన్‌ను త్రిసభ్య ధర్మాసనం తోసిపుచ్చితే ఈనెల 30న మెమెన్‌కు నాగ్‌పూర్‌ జైల్లో ఉరి శిక్ష అమలు చేయనున్నారు. ఇందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా త్రిసభ్య ధర్మాసనం తీర్పు యకూబ్ మెమెన్ కు అనుకూలంగా వచ్చిన పక్షంలో ఆయనకు క్షమాభిక్ష్ పెట్టి ఉరిశిక్షకు బదులు జీవితఖైదుగా శిక్షను విధించనున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 1993 mumbai blasts  curative petition  death penalty  supreme court  

Other Articles