girl tortured by father stepmother rescued in kushaiguda

Swapna another girl who tortured by stepmother like prathyusha in hyderabad

swapna another girl who tortured by stepmother like prathyusha in hyderabad, girl tortured by father stepmother rescued in kushaiguda, girl, torture, stepmother, rescue, kushaiguda, prathyusha, swapna, telangana, high court, prathyusha, hyderabad

A week after 19 year old Prathyusha was rescued and her stepmother arrested, another incident come occurred in Kushaiguda

మతిస్థిమితం కోల్పోయిన మరో ప్రత్యూష.. సవతి తల్లి చేతిలో చిత్రహింసలు..

Posted: 07/28/2015 08:30 PM IST
Swapna another girl who tortured by stepmother like prathyusha in hyderabad

హైదరాబాద్‌లో మరో సవతి తల్లి దారుణం వెలుగు చూసింది. సవతి తల్లి చేతిలో తీవ్ర చిత్రహింసలకు గురైన ప్రత్యూష ఘటన మరువక ముందే చర్లపల్లిలో మరో ఘోరం బయటపడింది. చర్లపల్లి రైల్‌ విహార్‌ కాలనీలో నివసించే రిటైర్డ్‌ రైల్వే ఉద్యోగి బెనర్టీ కుమార్తె స్వప్న (17)ను సవతి తల్లి లక్ష్మీ చిత్రహింసలు పెడుతోంది. ఏడేళ్ల క్రితం మొదటి భార్య చనిపోవడంతో బెనర్జీ లక్ష్మీని రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి భర్త లేని సమయంలో ప్రతిరోజు కుమార్తెకు చిత్రహింసలు పెడుతోంది. స్థానికుల పిర్యాదుతో రంగంలోకి దిగిన బాలల హక్కుల కమిషన్‌ అధికారులు పోలీసుల సహాయంతో బాధిత అమ్మాయికి విముక్తి కలిగించారు. నిత్యం సవతి తల్లి పెడుతున్న బాధలకు స్వప్న మతిస్థిమితం కోల్పోయింది. ఆమె తలకు, చేతులకు గాయాలు ఉన్నాయి. సరిగా మాట్లాడలేని స్థితిలో ఉన్న స్వప్నను మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

స్వప్నను ఎప్పుడు కొట్టలేదని, ఆమెకు వారానికి రెండు సార్లు పిట్స్‌ వస్తాయని దాంతో కింద పడిపోవడం వల్లే గాయాలు అయ్యాయని లక్ష్మీ బుకాయిస్తోంది. మెట్టిగూడ రైల్వే ఆస్పత్రిలో మందులు కూడా వాడుతున్నామని ఆమె చెబుతోంది. బాలల హక్కుల అధికారులు, పోలీసులు స్వప్ప ఇంటికి వెళ్లిన సమయంలో తండ్రి బెనర్టీ ఇంట్లో లేరు. సవతి తల్లి లక్ష్మీ, బెనర్జీని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇద్దరిని విడివిడిగా విచారిస్తున్నారు. కాగా, గతంలోనూ స్వప్న అక్క, బావలను సవతి తల్లి విషం పెట్టి చంపినట్లు ఆరోపణలు వినబడుతున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : girl  torture  stepmother  rescue  kushaiguda  prathyusha  swapna  

Other Articles