Rishitheshwari | Nagarjuna University | Rishitheshwari mystery | AP

Many questions on behalf of rishitheshwari suicide

Rishitheshwari, Nagarjuna University, Rishitheshwari mystery, AP, Govt, Chandrababu naidu. Babu Rao, rishitheshwari suicide

Many qestions on behalf of Rishitheshwari suicide. Ap govt must answer the rising questions about Rishitheshwari suicide.

రిషితేశ్వరి ఆత్మహత్య - ఎన్నో ప్రశ్నలు

Posted: 07/27/2015 11:08 AM IST
Many questions on behalf of rishitheshwari suicide

రితికేశ్వరీ ఆత్మహత్య.. చదవడానికి మామూలు పదాలుగా అనిపిస్తోందేమో కానీ ప్రతి అక్షరం వెనుక అమ్మాయి నరకయాతక ఎంత మంది చూడగలరు. కాలేజీల్లో చదవడానికి వెళ్లే వాళ్లకు ఎదురయ్యే తోటి విద్యార్థులే తోడేళ్ల లాగా ప్రాణాన్ని తీశారు. దవుల కోసం వచ్చిన అమ్మాయికి అనుక్షణం నరకం చూపిస్తూ.. చిత్రవదలు చేసి చివరకు ఆత్మహత్యకు పురికొల్పిన ఘటన గుంటూరు నాగార్జున యూనివర్సిటిలో చోటుచేసుకుంది. అన్యాయం జరిగిపోయింది... ఓ నిండు ప్రాణం బలైపోయింది. ఇదంతా గతం చనిపోయిన రితికేశకవరిని ఎలాగూ తిరిగి తీసుకురాలేం. కానీ అన్యాయాన్ని ప్రశ్నించడకపోవడం ఖచ్చితంగా అన్యాయమే... మేధావుల మౌనం సమాజానికి తీరని అన్యాయం చేస్తుంది. అన్యాయానికి వ్యతిరేకంగా తెలుగువిశేష్ సమరశంఖాన్ని పూరించింది. రండి... మాతో పాటు రితికేశ్వరికి జరిగిన అన్యాయం మీద పోరాడదాం...

Also Read:  వర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య వెనుక రియల్ మిస్టరీ ఇదే!

రితికేశ్వరి ఆత్మహత్య వెనుక ఎన్నో ప్రశ్నలు.. వాటికి సమాధానాలు వెతికే వారే లేరు. మరి ప్రభుత్వం దగ్గర వీటికి సమాధానం ఉందా...

* రిషితేశ్వరి  ఆత్మహత్య మీద ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు..? కులరాజకీయాలకు ప్రభుత్వం తలొగ్గిందని వస్తున్న వార్తల్లో నిజం లేదా.?
* ఆడవాళ్లకు మా ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది అని బీరాలు పలికిన చంద్రబాబు ప్రభుత్వం... రిషితేశ్వరికి రక్షణ కల్పించడం మాట అటుంచి కనీసం మాట కూడా మాట్లాడలేదు..? ఎందుకు.?
* ఓ యూనవర్సిటీలో విద్యార్థిని చనిపోతే చంద్రబాబు నాయుడు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు ఉన్నారు..?
* అసలు రిషితేశ్వరి  కేసుకి ప్రిన్సిపాల్ బాబూరావుకి సంభందమేంటి?
* ప్రిన్సిపాల్ బాబూరావ్ ను ఎందుకు సస్పెండ్ చెయ్యలేదు..?
* బాబూరావు సస్పెన్షన్ కు ముందుగానే నాటకీయంగా రాజీనామా ఎందుకిచ్చాడు? బాబూరావును కాపాడే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు?
* కాలేజీలో సుప్రీం ఆదేశాల మేరకు ఏర్పాటు చేయాల్సిన యాంటీ ర్యాగింగ్ కమిటీని ఎందుకు ఏర్పాటు చేయలేదు?
* రిషితేశ్వరిని వేదిస్తున్నారంటూ ఆమె చనిపోవటానికి పది రోజుల ముందు ఆమె పేరెంట్స్ ప్రిన్సిపాల్ కు కంప్లైంట్ ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదు?
* రెండు వేల మంది సాక్షిగా, నిజ నిర్ధారణ కమిటీ సమావేశం జరుగుతుండగా విద్యార్గుల మీద ఓ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది విద్యార్దులు దాడి చేసినా విసి ఎందుకు స్పందించ లేదు..?
* హాస్టల్ లో ఉన్న తోటి విద్యార్దినుల కంటే ముందు ఆమె మరణ వార్త బాయ్స్ హాస్టల్ కు ఎలా చేరింది?
* ఉరి తాడు బిగించుకున్నప్పుడు ఆమెను మొదట చూసింది ఎవరు?
* బాబూరావుకు ఎందుకు ఫోన్ చేశారు? హాస్టల్ వార్డెన్ కు ఎందుకు సమాచారమివ్వలేదు?
* కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకమైన ప్రొఫెసర్, వర్శిటీ కాలేజీలు/విభాగాలకు కనీసం HOD గా నియమింపబడాలన్నా అతనొక పర్మినెంట్/రెగ్యులర్ ఉద్యోగి అయి ఉండాలి. కానీ బాబూరావు విషయంలో నిభందనలు వర్తించవు. ఎందుకంటే అతని కులమే అతని అర్హత?
* రిషితేశ్వరిని వేదిస్తున్నారంటూ ఆమె చనిపోవటానికి పది రోజుల ముందు ఆమె పేరెంట్స్ ప్రిన్సిపాల్ కు కంప్లైంట్ ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదు?
* ప్రతిపక్ష నేత జగన్ కు ఈ విషయం పై మాట్లాడితే అధికార పక్ష నాయకులు ఆయేషా కేసు గురించి లేవనెత్తుతారని నోరు మెదపడం లేద??
* రిషితేశ్వరి ఉదంతంతో ఉలిక్కిపడి భాగ్యలక్ష్మిని వేధించిన విద్యార్దినులను గతంలోనే హాస్టల్ నుండి బయటకు పంపివేసినట్టు చెపుతున్నారు. అయితే ఆ ముగ్గురు వర్శిటీ గెస్ట్ హౌస్ లో ఉండి తరగతులకు హాజరవుతున్నారు. గెస్ట్ హౌస్ లో ఉండటానికి రిజిస్ట్రార్ అనుమతి తప్పనిసరి. మరి వారికెలా అనుమతినిచ్చారు? తప్పు చేసినా ఒక కులానికి చెందిన వారైతే వారిపై కంటితుడుపు చర్యలేనా? ఇలా తప్పు చేసిన వారిని ప్రోత్సహించి ఈ రోజు రిషితేశ్వరి ప్రాణం పోవటానికి ప్రత్యక్షంగా కారణమైంది ఎవరు???

#Rishiteshwari #?WeWantJustice #JusticeForRishiteshwari

Also Read: రిషికేశ్వరి ఘటనతో ఆందోళన.. యూనివర్సిటికి పది రోజులు సెలవులు
Also Read: మహిళా మంత్రులు గాడిదలు కాస్తున్నారా..? రోజా
Also Read:  నాగార్జునా యూనివర్శిటీలో ఉద్రిక్తత.. తూతూ మంత్రంగా ముగిసిన నిజనిర్థారణ కమిటీ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles