Rishikeshwari | Nagarjuna University | Sucide | Ragging, Harrasment

Nagarjuna university declare holidays for ten days

Rishikeshwari, Nagarjuna University, Sucide, Ragging, Harrasment

Nagarjuna University declare holidays for ten days. On Rishikeshwari suicide incident, Nagarjuna University students peotest for justice.

ITEMVIDEOS: రిషికేశ్వరి ఘటనతో ఆందోళన.. యూనివర్సిటికి పది రోజులు సెలవులు

Posted: 07/25/2015 10:53 AM IST
Nagarjuna university declare holidays for ten days

ఆచార్య నాగార్జున యూనివర్శిటీని పదిరోజుల పాటు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్కిటెక్చర్‌ విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య ఘటనతో గత మూడు రోజులుగా యూనివర్సిటిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం.. అక్కడ పరిస్థితులు సజావుగా సాగటానికి కొద్ది రోజులు సెలవులు ఇవ్వాలని ఆదేశించటంతో విశ్వవిద్యాలయం పది రోజులు సెలవులు ప్రకటించింది. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు విశ్వవిద్యాలయంలో ఉన్న అన్ని కుల సంఘాల బోర్డులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. వసతి గృహాల్లో ఉన్న బయట వ్యక్తులను తక్షణమే పంపించేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Also Read:  వర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య వెనుక రియల్ మిస్టరీ ఇదే!

సీనియర్ల ఆగడాలకు బలైపోయిన రిషికేశ్వరి ఘటనపై యూనివర్సిటిలో ఆగ్రహ జ్వాలలు రేగాయి. సీనియర్ విద్యార్థులు ఎంతగా ర్యాగింగ్ చేస్తున్నా కూడా యూనివర్సిటి విసి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని... ప్రిన్సిపాల్ కూడా ఏమీ చెయ్యలేకపోతున్నారని మండిపడుతున్నారు. అయితే దీని మీద సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైంది. రిషికేశ్వరీ తన మీద, తనలాంటి జూనియర్ల మీద జరుగుతున్న ర్యాగింగ్ భూతానికి బలైన విధానం మీద లెటర్ లో వివరించింది. దేశవ్యాప్తంగా ర్యాంగింగ్ మీద నిషేదం ఉన్నా కానీ నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ కొనసాగడం మీద విమర్శలు వస్తున్నాయి. నాగారర్జున వర్సిటీలో రిషికేశ్వరీ ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేగింది.

Also Read:  నాగార్జునా యూనివర్శిటీలో ఉద్రిక్తత.. తూతూ మంత్రంగా ముగిసిన నిజనిర్థారణ కమిటీ

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ జిల్లా విద్యార్థిని రుషికేశ్వరి మృతి కేసును గుంటూరు జిల్లా లీగల్‌సెల్ అథారిటీ శుక్రవారం సుమోటోగా స్వీకరించింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆమె ర్యాగింగ్ వల్లే చనిపోలేదని, సహ విద్యార్థుల లైంగిక వేధింపులు కూడా కారణమని భావిస్తున్నారు. ఆర్కెటెక్ కళాశాల ప్రిన్సిపాల్ మద్యం సేవించి విద్యార్థులతో కలిసి చిందులేసిన దృశ్యాలు లీగల్‌సెల్ అథారిటీకి చేరాయి. వీటి ఆధారంగా ఈ కేసును సుమోటోగా జిల్లా లీగల్‌సెల్ అథారిటీ స్వీకరించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్ బాబూరావు, వార్డెన్ స్వరూపరాణికి నోటీసులు జారీ చేసింది.

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rishikeshwari  Nagarjuna University  Sucide  Ragging  Harrasment  

Other Articles