Terrorists Attack Punjab Police Station Gurudaspur | Mumbai 26/11 attacks

Terrorists attack punjab police station gurudaspur

punjab terror attack, punjab attacks, terror attack, terror attack on police station, terrorirsts attack on punjab, mumbai 26/11 attacks

Terrorists Attack Punjab Police Station Gurudaspur : four terrorists in Army uniform entered India at the Hiranagar border in Jammu early this morning and opened fire at a bus before attacking a police station in Punjab's Gurdaspur

ముంబై 26/11 తరహాలో పంజాబ్ లో ‘ఉగ్ర’దాడి

Posted: 07/27/2015 10:09 AM IST
Terrorists attack punjab police station gurudaspur

‘ముంబై 26/11’ దాడులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే! ఆ తర్వాత అటువంటి దాడులు జరగకుండా భారత ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చింది. అయితే.. పంజాబ్ లో అనుకోకుండా కొందరు ఉగ్రవాదులు ముంబై తరహా దాడికి తెగబడ్డారు. ఆర్మీ దుస్తులు ధరించిన నలుగురు దుండగులు పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్ పూర్ జిల్లాలో వున్న దీవానగర్ పోలీస్ స్టేషన్ పై కాల్పులు జరిపారు. ఈరోజు (సోమవారం) ఉదయం నుంచి కొనసాగుతున్న ఈ కాల్పుల్లో ఇప్పటికే ఇద్దరు పోలీసులు మరణించగా.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రస్తుతం అందుతున్న సమాచారాల ప్రకారం.. ఆ నలుగురు దుండగులు వేరొక ప్రాంతంలో ఓ తెలుపురంగు మారుతీ కారును దొంగలించి.. దీవానగర్ కు చేరారు. తొలుత అటుగా వెళుతున్న ఓ బస్సుపై కాల్పులకు తెగబడ్డ వారు.. ఆ తర్వాత ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ లోకి చొచ్చుకొనివెళ్లారు. తమ చేతుల్లో వున్న తుపాకులతో ఒక్కసారిగా పెట్రేగిపోయారు. అక్కడున్న గార్డులను చంపి స్టేషన్ ను తమ అధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే.. ఈ హఠాత్పరిణామంతో తేరుకున్న పోలీసులు కూడా ఆ ఉగ్రవాదులపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ దాడుల్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ తోపాటు మరో పౌరుడు చనిపోయాడు. ఏడుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దుండగులు, పోలీసుల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతూనే వున్నాయి. దీంతో అక్కడి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

మరోవైపు.. దీవానగర్-పఠాన్ కోట్ మధ్య వున్న రైల్వే ట్రాక్ పై పోలీసులు ఐదు బాంబులను గుర్తించారు. దీంతో హైలర్ట్ ప్రకటించిన ఉన్నతాధికారులు నేరుగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ సంఘటన చోటుచేసుకున్న దీవానగర్.. పాకిస్తాన్ సరిహద్దుకు అతి సమీపంలో వుంది. ఆ ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ కీలక స్థావరాలు వున్నాయి. దీంతో ఈ దాడికి పాల్పడింది ఉగ్రవాదులేనని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఉగ్రవాదుల్లో ఓ మహిళ కూడా వుంది. ఈ దాడులకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : punjab terror attack  terror attack on police station  mumbai 26/11 attacks  

Other Articles