fact finding committee meet ends abruptly in nagarjuna university

University principal suspended for student s death

University principal suspended for student’s death, fact finding committee meet ends abruptly in nagarjuna university, Rishikeshwari, Acharya Nagarjuna University, Guntur, Nagarjuna University, Rishikeshwari, student dies of ragging, fact finding committee,

The AP Higher Education has responded to the death of Rishikeshwari of Acharya Nagarjuna University. The principal of the college, Babu Rao was suspended by Council of Higher Education

నాగార్జునా యూనివర్శిటీలో ఉద్రిక్తత.. తూతూ మంత్రంగా ముగిసిన నిజనిర్థారణ కమిటీ

Posted: 07/23/2015 10:30 PM IST
University principal suspended for student s death

ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో జడలు విప్పిన ర్యాంగ్ బూతం కాటుకు రిషికేశ్వరి అనే విద్యార్థిని బలైన ఘటనలో దారుణమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఆత్మహత్య చేసుకున్న ముందురోజు రిషికేశ్వరిని సీనియర్‌ విద్యార్థులు తీవ్రంగా వేధించారని, అర్ధనగ్నంగా హాస్టల్‌ గదిలో నడిపించి... దాన్ని సెల్‌లో చిత్రీకరించినట్లుగా వెల్లడైంది.. తర్వాత ఆ వీడియోను ఇతరులకు పంపించారని, తమతో సన్నిహితంగా ఉండకపోతే ఈ వీడియోలు బహిర్గతం చేస్తామని సీనియర్లు బెదిరించినట్లుగా తెలియవచ్చింది. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపం చెందిన రిషికేశ్వరి ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది.

ఈ కేసులో ఇప్పటికే సీనియర్ విద్యార్థులు అనిషా, శ్రీనివాస్‌ లతో పాటుగా శ్రీచరన్‌ అనే లెక్చరర్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా రుషికేశ్వరి మృతి కేసులో ఆర్కిటెక్చర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ బాబూరావును ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. ఈ కేసులో దర్యాప్తు జరిపే కొద్ది ర్యాగింగ్‌కు సంబంధించిన అనేవ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనపై ఇవాళ నాగార్జున యూనివర్శిటీకి చేరుకున్న నిజనిర్థారణ కమిటీ విచారణ తూతూ మంత్రంగా సాగగా, విచారణలో హైడ్రామా చోటుచేసుకుంది.

అర్కిటెక్చర్ కాలేజ్ ప్రిన్సిపల్ బాబురావు విద్యార్థినులతో సాగించిన అసభ్యకర ప్రవర్తనను విద్యార్థినులు ఫోన్‌లో చిత్రీకరించి విచారణ కమిటీకి అందజేశారు. లేటు నైట్ రేవ్ పారటీలకు విద్యార్థులతో పాటు విద్యార్థినులను కూడా తీసుకెళ్లి తన వయస్సును, హోదాను మరచి బాబురావు విద్యార్థులతో కలసి క్లబ్ డాన్సర్ లా చిందులు వేయడాన్ని నిజనిర్థారణ కమిటీ చూసి విస్తుపోయింది. ఈ వీడియోలను కమిటీ విక్షింస్తున్న సమయంలో రెండు పర్యాయాలు విద్యుత్ పరఫరా నిలిచిపోయింది.

సరిగ్గా అదే అదనుగా చేసుకున్న బాబురావు అనుచర వర్గానికి చెందిన విద్యార్థులు, హాల్ లోనికి ప్రవేశఇంచారు. అక్కడే వున్న మీడియా సమక్షంలో విద్యార్థి సంఘాల నేతలపైనా వాళ్లు దాడులు చేశారు. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువార్గాలను అక్కడి నుంచి చెదరగోట్టారు. నిజనిర్థారణ కమిటీ సమావేశం ప్రారంభమైన కోద్దిసేపటికే తూతూ మంత్రంగా ముగిసిపోయింది. ప్రిన్సిపల్ బాబురావుపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలని అనుకూల వర్గానికి చెందిన విద్యార్థులు నినాదాలు చేయగా, విద్యార్థిని రుషికేశ్వరి మృతిపై న్యాయమూర్తిచేత విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rishikeshwari  baburao  Principal  suspended  Acharya Nagarjuna University  

Other Articles