Ganapathy Sachchidananda Swamiji Creates World History | guinness record

Ganapathy sachchidananda swamiji music theraphy won guinness record

Ganapathy Sachchidananda Swamiji Creates World History, Ganapathy Sachchidananda Swamiji music Theraphy won guinness record, Australia, Nada Sagara concert, Pujya Sri Swamiji, 'Largest Music Therapy Lesson', Guinness World ...Record, Sachchidananda Swamiji's Music for Meditation & Healing,

World record was created at Australia Nada Sagara concert conducted by Pujya Sri Swamiji at the iconic Sydney Opera House on 6th April 2015. The Guinness World ...Record was awarded in the category 'Largest Music Therapy Lesson'. ... Pujya Sri Ganapathy Sachchidananda Swamiji's Music for Meditation & Healing

ప్రపంచ రికార్డుల్లోకి సచ్చిదానంత ‘సుదీర్ఘ’ నాదసాగర

Posted: 04/08/2015 09:41 AM IST
Ganapathy sachchidananda swamiji music theraphy won guinness record

మనిషి మనస్సును రంజింపచేయ గలిగితే.. శరీరంలోని రుగ్మతలను కూడా దూరం చేసుకోవచ్చునని డాక్టర్ గణపతి సచ్చిదానంద స్వామీజి విశ్వసించి అమలు చేస్తున్న మ్యూజీక్ ధెరపీ గెన్నీస్ రికార్డులలో స్థానం సంపాదించింది. మానవ దేహంపై అద్భుతమైన ప్రభావం చూపుతూ అనేక రకాల దీర్ఘకాలిక, తాత్కాలిక వ్యాధుల నుంచి విముకి కల్పించే స్వామీజీ మ్యూజిక్ థెరపీకి  అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ నెల 6వ తేదీన ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఒపేరా హౌస్‌లో  నిర్వహించిన సుదీర్ఘమైన మ్యూజిక్ థెపరీ  పాఠం  గిన్నిస్‌బుక్ రికార్డుల్లోకి ఎక్కింది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన  స్వామీజీ సిడ్నీలో నిర్వహించిన మ్యూజిక్ థెరపీ క్లాస్ గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించడం పట్ల  ఆయన అభిమానులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు. మందులు వాడుతూనే  ఈ సంగీతాన్ని ఆస్వాదించడం వల్ల నాడీ వ్యవస్థ, శరీరంలోని వివిధ అవయాలు  స్వాంతన పొందగలుగుతాయని, రోగవిముక్తమవుతాయని  ఆయన పేర్కొన్నారు. సిడ్నీలో జరిగిన కార్యక్రమంలో వయొలిన్ కళాకారుడు డాక్టర్ ఎల్.సుబ్రహ్మణ్యం, సంగీత కళాకారులు రామదాసు, వి.సురేష్, తదితరులు పాల్గొన్నారు.

మధ్య అస్ట్రేలియాలో సిడ్నీలో జరిగిన నాద సాగర కార్యక్రమానికి ఏర్పాటు చేసిన అహుతులు, వాటెంటీర్లకు, సభ్యులకు గణపతి సచ్చితానంద స్వామీజి ధన్యవాదలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఈ కార్యక్రమంలో పాలో్గన్నారు. అమెరికా, దక్షిణాఫ్రికా, మలేషియా, స్విట్జర్ ల్యాండ్, డెన్ మార్క్, ల నుండి కూడా అయా దేశాల ప్రతినిధులతో అనేక మంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరితో పాటు విదేశాలలో ( జర్మనీ, కెనడా, ట్రినిడాడ్, సింగపూర్; న్యూజీలాండ్, జపాన్, ఇండోనేషియా సహా అనే దేశాల నుంచి) భారతీయులు కూడా కార్యక్రమంలో భాగం పంచుకున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles