Hyderabad | Elections | Seats | Corporation

Greate hyderabad leaders jumping from party to another party for corporate seats

Greater hyderabad, Hyderabad, Elections, Partys, Corporates, TRS

greate hyderabad leaders jumping from party to another party for corporate seats. Up coming greater hyderabad elections, all party leaders intereting to get corporate seat from any party. TRS party corporate seats mede like hot cakes in this elections season.

జంపింగ్ జపాంగ్ జంపక్..జంపక్

Posted: 04/08/2015 10:46 AM IST
Greate hyderabad leaders jumping from party to another party for corporate seats

ఐపిఎల్ పాట అందరికి తెలిసే ఉంటుంది. ఐపిఎల్ ప్రమోషన్ కోసం వచ్చిన ఆ పాట ఎంతో ఫేమస్. అయితే పాట సంగతి ఏమో కానీ కొందరు మాత్రం అందులోని జంపింగ్ జపాంగ్ లిరిక్ ను మాత్రం బాగా అర్థం చేసుకున్నారు. అదేంటి కొందరు మాత్రమే అనుకుంటున్నారా.. మరి వారు ఎవరో కాదు రాజకీయ నాయకులు అది కూడా గ్రేటర్ హైదరాబాద్ నేతలు. తెలంగాణ  రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి సారిగా గ్రేటర్ హైదరాబాద్ లో జరుగుతున్న ఎన్నికల్లో గెలుపు కొసం అన్ని పార్టీలు తాపత్రయ పడుతున్న విషయం అందిరికి తెలుసు. అయితే గ్రేటర్ హైదరాబాద్ వార్డుల పుర్విభజనతో వివిధ పార్టీలలో యువనేతలల్లో ఆశలు చిగురించాయి. అన్ని పార్టీలలో డివిజన్‌లలో అధ్యక్షులుగా, అసెంబ్లీ నియోజకవర్గాలలో అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఇన్‌చార్జులుగా పనిచేసిన వారందరి కన్నూ ఇప్పుడు కార్పొరేటర్ సీట్‌పై పడింది. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన రెండు తెలుగు రాష్ట్రాలకు 10 ఏళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతున్న గ్రేటర్ హైదరాబాద్‌లో కార్పొరేషన్ పాత్ర చాలా కీలకంగా మారడంతో పాలక మండలిలో స్థానం సంపాదించుకోవాలని నాయకులు.. పార్టీలు మారేందుకు సిద్దపడుతున్నారు. కాస్త ముందు చూపుతో వ్యవహరించిన కాంగ్రెస్, టిడిపి పార్టీలకు చెందిన నాయకులు వలసలు మొదలు పెట్టారు. అలా పార్టీలు మారుతూ.. తమ కు కావాల్సిన ఏరియా టికెట్ తెచ్చుకుంటున్నారు. అలా టికెట్ కోసం ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా జంపింగ్ లు చేస్తున్నారు నేతలు.

గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్ టిక్కెట్ దొరికితే చాలని ఎంతోమంది చోటా, బడా నాయకులు జంపింగ్‌లు చేసేందుకు ఎదురు చూస్తున్నారు. ప్రతి 40వేల జనాభా కలిగిన ప్రాంతాన్ని ఒక డివిజన్‌గా ఏర్పడుతన్న నేపథ్యంలో టిఆర్‌ఎస్ సీట్ల అయితే హాట్‌కేకుల్లా మారాయి. అసలు కార్పోరేషన్ పరిధిలొ ఎక్కడ ఖాళీగా ఉన్నా.. ఉందని సమాచారం వచ్చినా వెంటనే నేతలు పార్టీ ఆఫీసు చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. గతంలో పార్టీకి అన్ని రకాలుగా అండదండగా నిలిచిన నేతలు అయితే ఈ సారి ఖచ్చితంగా తమకు ఏదో కార్పోరేషన్ పరిధిలో సీటు కావాలని మొంకు పట్టుపడుతున్నారు. ఒకవేళ పార్టీ నుండి సీటు లభించకపోతే.. పార్టీ మారడానికి కూడా వారు సిద్దంగా ఉన్నామని ఇప్పటికే ప్రకటించారు. అలా పార్టీలు కాదు మాకు ముఖ్యం సీటు మాకు ముఖ్యం అంటూ సాగుతున్న గ్రేటర్ నేతలు ఏ దరికి చేరుతారో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Greater hyderabad  Hyderabad  Elections  Partys  Corporates  TRS  

Other Articles