AAP | Delhi | Media | kejriwal

Aap convenor delhi cm kejriwal clear that no need to respond on the media news

aap, kejriwal, aam admi party, yogerderyadav, prashanth bhushan, media, delhi, cm, party

aap convenor, delhi cm kejriwal clear that no need to respond on the media news. kejriwal said that other than the delhi govt no need to think on those. nothing on the issue of yogendrayadav, prashanthbhushan issue.

ఎవరి మాటా వినడు సీతయ్య.. కాదు కాదు కేజ్రీవాల్

Posted: 04/08/2015 12:03 PM IST
Aap convenor delhi cm kejriwal clear that no need to respond on the media news

కేజ్రీవాల్ రాజకీయ ప్రస్థానం ఎంతో మందికి ఆసక్తి రేపింది. పార్టీ మొదలు పెట్టడం తర్వాత పార్టీని విజయ తీరాలకు చేరువ చెయ్యడం లాంటివి కొన్ని లక్షల మందిని తన అభిమానులుగా మార్చుకున్నారు కేజ్రీవాల్. అయితే ఆప్ లో జరుగుతున్న కొన్ని పరిణామాలు కేజ్రీవాల్ క్రేజ్ కు డ్యామేజ్ తెచ్చింది. అయితే తనను ఎవరు ఏ విధంగా తిట్టుకున్నా తాను పట్టించుకోనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తన ఆలోచన మొత్తం పరిపాలన మీద ఉంటుందని, పాలనపై మిగితా విషయాల ప్రభావం ఏమాత్రం పడబోదని చెప్పారు. పరిపాలనేతర విషయాలపై తాను అసలు స్పందిచనని చెప్పారు. కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సొంత పార్టీలో విబేధాలపై స్పందించేందుకు నిరాకరించారు.

మొత్తానికి పార్టీ అంటే కేజ్రీవాల్ అనే పరిస్థితికి తీసుకువచ్చిన కేజ్రీవాల్ ప్రస్తుతం సీనియర్లు, మేధావుల గెంటివేతతో ఇరకాటంలో పడ్డారు. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ తనపై చేసిన వ్యాఖ్యల పట్ల చెప్పడానికి ఏమీ లేదన్నారు. 'నన్నే ప్రధానంగా చేసేందుకు తమ బ్లాగ్లలో ఎవరేమైనా రాసుకోవచ్చు. మీడియాలో ప్రచారం పొందడం కోసం నన్ను ఏమైనా తిట్టొచ్చు. కానీ అవి నాపై, ప్రభుత్వంపై ప్రభావం చూపలేవు' అని చెప్పారు. మొత్తానికి ఎవరు ఎన్ని రకాలుగా కామెంట్ చేసినా, మీడియా వార్తలు ప్రసారం చేసినా తాను మాత్రం వాటి గురించి పట్టించుకోను అంటూ కేజ్రీవాల్ క్లీయర్ చేశాడు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aap  kejriwal  aam admi party  yogerderyadav  prashanth bhushan  media  delhi  cm  party  

Other Articles