ruckus in J and K assembly Between Opposition, Ruling Lawmakers

Brawl in jammu and kashmir assembly between opposition ruling lawmakers

Brawl in Jammu and Kashmir Assembly, ruckus in J and K assembly, fight between Opposition and Ruling Lawmakers, students stunned seeing J and K assembly scenes, jammu and kashmir, assembly, brawl, PDP, National Conference

Lawmakers were seen manhandling and shoving each other and even throwing punches as complete chaos erupted in the Jammu and Kashmir assembly this morning.

ITEMVIDEOS: జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో పిడిగుద్దులు.. విద్యార్థులు బెంబేలు..

Posted: 03/27/2015 03:09 PM IST
Brawl in jammu and kashmir assembly between opposition ruling lawmakers

జమ్మూకాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీలో మునుపెన్నడూ లేని విధంగా ఇవాళ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అధికార, విపక్షాలను చెందిన అభ్యర్థులు చేయి చేయి చేసుకున్నారు. అంతేకాదు ఒకరిపై మరోకరు పిడి గుద్దులతో తలపడ్డారు. భారత దేశం తలలో సిగలా, సిగలో పుష్పంటా వుండే జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలోని ఈ భయానక దృశ్యాలను చూసి రేపటి పౌరులు ( విద్యార్థులు) భయాందోళనకు గురయ్యారు. చట్టసభలకు ఎన్నికయ్యామన్న గర్వంతో హుందాగా నడుచుకోవాల్సిన శాసనసభ్యులు ఒకరితో మరోకరు తలపడి శాసనసభ హుందాతనానికి మంగళం పాడారు.

జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ విద్యుత్ ప్రాజెక్టులపై చర్చ జరిగింది. చర్చ సందర్భంగా అధికార పీడీపీ, ప్రతిపక్ష నేషనల్‌కాన్ఫరెన్స్‌ సభ్యులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. విపక్ష సభ్యులు స్పీకర్‌ పోడియం వైపు దూసుకెళ్లేందుకు యత్నించగా వారిని అడ్డుకునేందుకు అధికారపక్ష సభ్యులు ప్రయత్నించారు. విద్యుత్‌ ప్రాజక్టులను రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి తేవడంలో పీడీపీ, బీజేపీ సర్కారు విఫలమైందని నేషన్‌ కాన్ఫరెన్స్‌ ఆరోపించింది. సభలోనే ధర్నాకు దిగింది. దీంతో అధికార పక్ష సభ్యులు విపక్ష సభ్యులతో కలబడటంతో హింసాత్మక ఘటనకు దారితీసింది.

అయితే జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో శాసనసభ్యులు చట్టాలను ఎలా చేస్తారు..? ఎలా అమోదిస్తారు..? అన్న విషయాలను ప్రత్యక్షంగా చూసేందుకు అతిధులుగా హాజరైన విద్యార్థులు షాక్ గురయ్యారు. శాసనసభ్యులు ఒకరితో మరోకరు కలబడటం, పిడిగుద్దులకు తెగబడటం చూసి బెంబేలెత్తిపోయారు. ఒకరినోకరు తోసుకుంటూ.. అసెంబ్లీలోని బెంచీలను ఎత్తేయడం, ఎంతో విలువైన పత్రాలను విసేరయడం చూసి విద్యార్థులు భీతిల్లిపోయారు. మార్షల్స్ వారించినా వినని శాసనసభ్యులు కలబడటంతో పాటు అడ్డుగా నిలచి రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తున్న మార్షల్స్ ను సైతం వదలకుండా మీడపడటం ఘటనలతో వారు భయాందోళన చెందారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jammu and kashmir  assembly  brawl  PDP  National Conference  

Other Articles