India versus Australia, ICC Cricket World Cup 2015, world cup india stills,

Australia batting steadily against india

India vs Australia, India versus Australia, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, Australia, Australia CWC 2015, Live Scores, Live Updates, India, India CWC 2015, Sports, World Cup Live

Australia batting steadily against India in world cup second semi final

స్మిత్ సెంచరి.. భారత బౌలర్లను ఉతికేస్తున్న అసీస్..

Posted: 03/26/2015 11:29 AM IST
Australia batting steadily against india

ప్రపంచ క్రికెట్ కప్ టోర్నమెంటులో భాగంగా సిడ్నీ వేదికగా ఢిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్ లో అతిధ్య జట్టు అస్ట్రేలియా భారత బౌలర్లను ఉతికేస్తుంది. వార్నర్ ఒక్క వికెట్ మాత్రమే కోల్పియిన అసీస్.. రన్ రేటును 5.6 వద్ద స్థిరంగా వుంచుకుంటూనే పరుగులను సాధిస్తూ.. ధోణి సేనను కలవరపెడుతోంది. అసీస్ తో మ్యాచ్ ఎలా ఆడాలో తెలుసునని బీరాలు పలికినా.. అవి ఏమి ఫలించడం లేదు. మూడో ఓవర్లో లభించిన వార్నర్ వికెట్ తరువాత  34 ఓవర్ వరకు మరో విక్కెట్ లభించిలేదు. 34 ఓవర్ లో స్మిత్ ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో స్మిత్, ఫించ్ మధ్య సుమారుగా 170 పరుగుల మేర సాగిన భాగస్వామ్యానికి బ్రేక్ పడింది.

వార్నర్ అవుట్ కావడంతో.. క్రీజ్ లోకి వచ్చిన స్మిత్ ప్రపంచ కప్ టర్నామెంటులో మంచి ఫామ్ లో రాణిస్తున్నాడు. ఇవాళ్టి మ్యాచ్ లోనూ పదకొండు ఫోరు, రెండు సిక్స్ ల సాయంతో సెంచరీ సాధించాడు. 104 పరుగులు వద్ద ఉమేష్ బౌలింగ్ లో పెవిలీయన్ దారి పట్టాడు. మరో ఎండ్ లో వున్న ఫించ్ కూడా హాఫ్ సెంచరీతో రాణించి ప్రస్తుతం 104 బంతులను ఎదుర్కోని ఐదు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 69 పరుగులు సాధించాడు. అసీస్ బ్యాట్స్ మెన్ ల పరుగులను కట్టడి చేయడంలో భారత్ సీమర్లు, స్పీన్నర్లు విఫలం చెందుతున్నారు. మంచి ఫామ్ లో వున్న మాక్స్ వెల్ మరో ఎండ్ క్రీజ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం అసీస్ స్కోరు 34 ఓవర్లకు 197 పరుగులు సాధించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  India  Australia  

Other Articles