ttdp | Mlas | arrested

Ttdp leaders wrer arressted by the police at assembly of telangana

ttdp, tdp, assembly. telangana, trs, police, arrest, gopinath mla, rajender reddy

ttdp leaders wrer arressted by the police at assembly of telangana. telangana tdp leaders were tried to enter the premises of telanagana assembly, the police officials stoped them and arrested.

టిటిడిపి ఎమ్మెల్యేల అరెస్ట్.. అనుమతి లేదని బ్యానర్

Posted: 03/26/2015 10:54 AM IST
Ttdp leaders wrer arressted by the police at assembly of telangana

పాపం తెలంగాణ లో తెలుగు తమ్ముళ్లకు గడ్డుకాలం నడుస్తున్నట్లుంది. తెలంగాణ సర్కార్ వారి పట్ల అవలంబిస్తున్న ధోరణి అలానే ఉంది. సస్పెండ్ కు గురైన తెలుగు తమ్ముళ్లు తమపై సస్పెన్షన్ ను ఎత్తివెయ్యాలని ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నా ఫలితాలు మాత్రం రావడం లేదు. అయితే తాజాగా తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలకు అనుమతి లేదంటూ స్పీకర్‌ పేరుతో ఉస్మానియా గేటుకు బ్యానర్‌ ఏర్పాటు చేశారు. మీడియాను చూసిన పోలీసులు బ్యానర్‌ను తొలగించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎల్‌. రమణ అసెంబ్లీకి వస్తుండగా గేటు వద్దనే పోలీసులు ఆయన్ని నిలిపివేశారు.  తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలను మార్షల్స్ మరోసారి అడ్డుకున్నారు. గురువారం ఉదయం టీ.టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలోకి వచ్చిన వారిని లోనికి వెళ్లకుండా మార్షల్స్ అడ్డుకోవటంతో తీవ్ర వాగ్వివాదానికి దిగారు.  మరోవైపు పోలీసులు కూడా ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు.

దాంతో తమను దొంగలుగా చూస్తున్నారని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, గోపీనాథ్, మాధవరం కృష్ణారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  సస్పెండ్ అయినంత మాత్రాన తమను అసెంబ్లీ ఆవరణలోకి రానివ్వకపోవడం సరికాదని ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు.  మార్షల్స్, పోలీసుల తీరుకు నిరసనగా తెలంగాణ టీడీపీ కార్యాలయం ఎదుట బైఠాయించిన ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. మొత్తానికి సస్పెండ్ కు గురయ్యారు, తర్వాత అరెస్టులకు గురవుతూనే ఉన్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ttdp  tdp  assembly. telangana  trs  police  arrest  gopinath mla  rajender reddy  

Other Articles