Australia losses two wickets continuously against India

Australia losses two wickets continuously against india

India vs Australia, India versus Australia, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, Australia, Australia CWC 2015, Live Scores, Live Updates, India, India CWC 2015, Sports, World Cup Live

Australia batting steadily against India in world cup second semi final

వరుసగా రెండు విక్కెట్లను కొల్పోయిన అసీస్..

Posted: 03/26/2015 11:32 AM IST
Australia losses two wickets continuously against india

ప్రపంచ క్రికెట్ కప్ టోర్నమెంటులో భాగంగా సిడ్నీ వేదికగా ఢిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్ లో అతిధ్య జట్టు అస్ట్రేలియా భారత బౌలర్ల ధాటికి వరుసగా రెండు విక్కెట్లను కోల్పియింది. 38 వ ఓవర్ ను వేసిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వేసిన మూడవ బంతికి ప్రపంచకప్ లో ప్రత్యర్థి జట్టును మట్టికరింపిచి వేగంగా పరుగులు సాధించడంతో దిట్టగా పేరొందిన మాక్స్ వెల్ అవుట్ అయ్యాడు. దీంతో మూడు విక్కెట్లు కోల్పోవడంతో ధోణి సేన కొంత ఉపశమనం పోందింది. అయితే మరో ఎండో వున్న ఫించ్ 80 పరుగులతో రాణిస్తుండడం టీమిండియాను కలవర పెట్టింది.

ఈ క్రమంలో ఉమేష్ యాదవ్ వేసిన తదనంతర ఓవర్ రెండో బంతికి ఫించ్ కూడా సింపుల్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మూడో ఓవర్లో లభించిన వార్నర్ వికెట్ తరువాత  34 ఓవర్ వరకు మరో విక్కెట్ లభించిలేదు. 34 ఓవర్ లో స్మిత్ ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో స్మిత్, ఫించ్ మధ్య సుమారుగా 170 పరుగుల మేర సాగిన భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తరువాత వెనువెంటనే రెండు వికెట్లను అసీస్ కోల్పయింది. ప్రస్తతం అస్ట్రేలియా కెప్టెన్ మైకిల్ క్లార్, షేన్ వాట్సన్ లు క్రీజ్ లో వున్నారు.

కాగా ఇవాళ్టి మ్యాచ్ లో స్మిత్ పదకొండు ఫోరు, రెండు సిక్స్ ల సాయంతో సెంచరీ సాధించాడు. 104 పరుగులు సాధించగా, ఫించ్ కూడా 7 ఫోర్లు, ఒక సిక్స్ సాయింతో 81 పరుగులు సాధించి వెనుదిరిగాడు. మాక్స్ వెల్ కేవలం 14 బంతులను ఎదుర్కోని మూడు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 23 పరుగులు సాధించాడు. భారీ స్కోరును టీమిండియా ముందు లక్ష్యంగా పెట్టాలని పరుగులు తీస్తున్న అసీస్ బ్యాట్స్ మెన్ లను ధోని సేన స్లాగ్ ఓవర్ల్ లో ఎలా కట్టిడి చేస్తుందో వేచి చూడాలి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  India  Australia  

Other Articles