Rajasekhara reddy statues top illegal statues list

Rajasekhara Reddy statues top illegal statues list, late chief minister Y.S.R statues top illegal statues list, Y.S. Rajasekhara Reddy, Y.S.R statues blocking the right of way, Y.S.R statues blocking various roads in AP, YS Jagan Mohan Reddy, Andhra Pradesh, Y.S. Rajasekhara Reddy statues, YSRCP, YSR Congress party, YS jagan mohan Reddy, Roads and buildings department, Andhrapradesh, TDP government

Statues of late chief minister Y.S. Rajasekhara Reddy have topped the list of illegal statues that are blocking the right of way on various roads in AP.

వైఎస్ విగ్రహాలకు ఆ జాబితాలో టాప్ ప్లేస్..!

Posted: 03/03/2015 12:48 PM IST
Rajasekhara reddy statues top illegal statues list

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు ఆ జాబితాలో అగ్రస్థానం సంపాదించాయి. ఏ జాబితా అని ఆశ్చర్యపోతున్నారా..? నవ్యాంధ్ర రాష్ట్రంలో అక్రమంగా వెలసిన విగ్రహాలు జాబితాలో వైఎస్ విగ్రహాలు ప్రధమ స్థానాన్ని అక్రమించాయి. రాష్ట్రంలోని వివిధ రోడ్లకు అడ్డుగా వుండటంతో పాటు రాకపోకలకు విఘాతం కలిగిస్తున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ అధికారులు తేల్చారు. రాష్ట్రంలోని పలు ప్రధాన కూడళ్ల వద్ద వెలసిన విగ్రహాలపై ఈ మేరకు రోడ్లు భవనాల శాఖ ప్రభుత్వానికి వివరణాత్మక నివేదిక సమర్పించారు.

విశాఖ పట్నంలోని పాడేరు, విశాఖపట్నం రెండు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఏకంగా 50 విగ్రహాలు అక్రమంగా ఏర్పాటు చేశారని ఆ శాఖ అధికారులు నివేదికలో పేర్కోన్నారు. అందులో 47 విగ్రహాలు కేవలం దివంగత మహానేతకు చెందినవి కావడం గమనార్హం. ఈ విగ్రహాలన్నీ ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసినవని, అంతేకాక వీటి ఏర్పాటుతో రాకపోకలకు విఘాతం కలుగుతుందని అన్నారు.  వీటి ఏర్పాటు కోసం పలు ప్రధాన కూడళ్లలో రోడ్లు, ఫుట్ ఫాత్ లతో పాటు డివైడర్ స్థానాలను అక్రమించి విగ్రహాలను ఏర్పాటు చేశారన్నారు. మరోవైపు ఈ విగ్రహాల ఏర్పాటుకు సంబంధిత అధికారుల నుంచి కూడా ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే విగ్రహాలను ఏర్పాటు చేశారని పేర్కోన్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆయన కార్యకర్తలు, కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ శ్రేణులు ఈ విగ్రహాలను ఏర్పాటు చేశారన్నారు. వైఎస్ మరణానంతరం ఓదార్పు యాత్ర చేపట్టిన వైసీపీ అధినేత జగన్ ఆధ్వర్యంలోనే అనేక విగ్రహాలు ఏర్పాటయ్యాయని, ఆ సమయంలోనే విగ్రహాలను ఆయన ఆవిష్కరించారని రోడ్లు భవనాల శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్ర విభజన జరిగి నవ్యాంధ్రలో తమ ప్రత్యర్థి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతోనే విగ్రహాల అంశాన్ని రాద్దాంతం చేస్తున్నారని వైసీపీ పార్టీ ఆరోపించింది. గతంలో ఏర్పటు చేసిన విగ్రహాలకు అనుమతులు వున్నాయా అంటూ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో వున్న అన్ని విగ్రహాలపై సర్వే జరిపించాలన వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Y.S. Rajasekhara Reddy  YSRCP  Andhra Pradesh  

Other Articles