Kejriwal tweets his pain

kejriwal, tweet, aap, prashanthbhushan,yogendrayadav,delhi

After 24 hours of allegations and counter-allegations, Arvind Kejriwal has finally spoken up on Twitter about the ongoing civil war within AAP. I am deeply hurt and pained by what is going on in the party. This is betrayal of trust that Delhi posed in us

ఆప్ లో వివాదాలు నన్ను బాధించాయి..ట్విట్టర్ లో కేజ్రీవాల్

Posted: 03/03/2015 11:51 AM IST
Kejriwal tweets his pain

ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆప్ లో లుకలుకలు మొదలయ్యాయి. ఆప్ సిద్దాంతాలకు భిన్నంగా జోడు పదవుల్లో కొనసాగుతున్న వారికి వ్యతిరేకంగా కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కాగా పార్టీ వ్యవస్థాపకుల్లో కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ భూషణ్, యోగేంద్రయాదవ్ లు పార్టీ నాయకత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని వివరిస్తు వారు లేఖలు కూడా రాశారు. అయితే ఆప్ లో మొదలైన ఈ గొడవ కాస్తా, చిలిచిలికి గాలివానగా మారింది. మీడియా ఆప్ వ్యవహారంపై కథనాలను ప్రసారం చెయ్యడం, అభిమానులు కూడా పార్టీ గురించి చర్చించడం మొదలైంది.

మొత్తం వ్యవహారంపై ఇప్పటి దాకా పెదవి విప్పని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా కొన్ని వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. ఢిల్లీ ప్రజలు ఎంతో నమ్మకంతో తమను అధికారంలో కూర్చోబెట్టారని, వారికి సుపరిపాలన అందించడం తమ ముందున్న లక్ష్యమని ట్వీట్ చేశారు. ఆప్ లో జరుగుతున్న వివాదాలపై తాను ఘాడంగా కలత చెందినట్లు అరవింద్ తెలిపారు. అయితే అసలు తను ఏం చెయ్యబోతున్నాడో మాత్రం కేజ్రీవాల్ చెప్పకపోవడం గమనార్హం.

kejtw

ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించడం దగ్గరి నుండి, అధికారంలోకి తీసుకు రావడం వరకు అన్నింటిలో ముందున్న యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ లు ఇలా వివాదాలకు కేంద్ర బిందువుగా మారడం విశేషం. పార్టీ సిద్దాంతాలు, రాజకీయాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాలన్న బలమైన సంకల్పంతో ప్రారంభమైన పార్టీ ఇలా వివాదాలతో వార్తకెక్కింది. అయితే పార్టీలో జరుగుతున్న వివాదాలపై రేపు జరగనున్న ఆప్ సమావేశంలో అన్నీ పరిష్కారమవుతాయని కొందరు భావిస్తున్నారు. అసలు పరిష్కారమవుతాయో, కొత్త వివాదాలకు బీజం పడుతుందో రేపటి్కి గానీ తేలదు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kejriwal  tweet  aap  prashanthbhushan  yogendrayadav  delhi  

Other Articles