Threats made by islamic state militants against the twitter and other employees

isis, terrorists, twitter, Jack Dorsey

Supporters of the Islamic State in Iraq and Syria (ISIS) on Sunday called on other supporters to kill Twitter founder Jack Dorsey and Twitter employees, after the social media company repeatedly blocked the accounts of jihadists who use the platform to spread videos of executions.

ట్విట్టర్ పై ఐఎస్ఐఎస్ యుద్దం.. తాజా పోస్ట్ కలకలం

Posted: 03/03/2015 01:13 PM IST
Threats made by islamic state militants against the twitter and other employees

కరడుగట్టిన మతోన్మాదులు, రక్తం తాగే మానవమృగాలు, రక్తపిపాసులు ఇలా ఎంత చెప్పినా తక్కువే వారి గురించి. ప్రపంచానికి రక్తపు మరకలు అంటిస్తున్న ఐఎస్ఐఎస్ తాజాగా ట్విట్టర్ పై యుద్దానికి సిద్దపడింది. నిన్నటి దాకా మనుషుల రక్తాన్ని కళ్ల చూసిన తీవ్రవాదులు ఇప్పుడు సోషల్ మీడియాపై పడ్డారు. తమ నెట్ వర్క్ ను ప్రపంచం మొత్తం వ్యాపింపజేసిన ఈ సంస్థ, ఫేస్ బుక్,ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా సహాయంతో కొత్త వారిని తమ సంస్థలోకి చేర్చుకుంటోంది. ఇలా చాలా మంది ఈ ఉగ్రవాద సంస్థ పట్ల ఆకర్షితులుగా మారి, ఉగ్రవాదులుగా మారుతున్నారు. నిఘా వర్గాల హెచ్చరిక మేరకు అనుమానాస్పద అకౌంట్లను క్లోజ్ చేసింది ట్విట్టర్.

నిన్నటి దాకా సోషల్ మీడియా ద్వారా తమ నెట్ వర్క్ ను నడిపిన ఐఎస్ఐఎస్..ట్విట్టర్ వైఖరితో ఖంగుతింది. ట్విట్టర్ లో తమ అకౌంట్లను క్లోజ్ చెయ్యడంపై ఉగ్రవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ స్థాపకుడు జాక్ డోర్సీ కి వ్యతిరేకంగా కొన్ని కామెంట్లు పోస్ట్ చేశారు. తమ పై యుద్దానికి దిగడం అంటే స్వతహాగా యుద్దం చేసుకున్నట్లేనని, ట్విట్టర్ ను స్థాపించిన వారిని, అందులో పని చేసే వారికి ఉగ్రవాదులు హెచ్చరికలు జారీ చేశారు. తమ వారు సింహాల్లా పంజా విసిరితే, కనీసం చూడడానికి కూడా ఉండరని, తిరిగి రాని లోకాలు వెళతారు అంటూ వారు తీవ్రంగా హెచ్చరించారు.

isis-in-twi

మరో పక్క ఉగ్రవాదులు ట్విట్టర్ పై యుద్దానికి దిగడం కలకలం రేపింది. అనుమానం ఉన్న దాదాపు 2 వేల ట్విట్టర్ ఖాతాలను మూసివెయ్యడం పై అంతర్జాతీయ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. అసలు ఉగ్రవాదులు ఎక్కడి నుండి తమ పోస్ట్ లను పంపుతున్నారు, ఎలా పంపుతున్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు ట్విట్టర్ కార్యాలయాల వద్ద, ఉద్యోగులకు ప్రత్యేక రక్షణ కల్పిస్తున్నారు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : isis  terrorists  twitter  Jack Dorsey  

Other Articles