Finally book on sonia out in indian market after unofficial ban

sonia gandhi, the red sari, book on the life of Sonia Gandhi, book on the times of Sonia Gandhi, book on Congress President Sonia Gandhi, Congress President Sonia Gandhi, Spanish author Javier Moro, javier maro book on sonia gandhi, javier maro book in india markets, javier maro book released in indian stands

It seems the trouble mounting for the beleaguered Congress. Spanish writer Javier Moro's 'The Red Sari', controversial, unauthorized biography of Congress president Sonia Gandhi is being released by Roli Books in India.

ఎర్ర చీర అనుకున్నట్లుగా భయపెడుతుందా..? లేక లాభం చేస్తుందా..?

Posted: 01/17/2015 02:48 PM IST
Finally book on sonia out in indian market after unofficial ban

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జీవిత చరిత్రకు కాస్త కల్పన జోడించి స్పెయిన్ రచయిత జేవియర్ మోరో రాసిన వివాదాస్పద ‘ఎల్ సారీ రోజో’ పుస్తకం ఎట్టకేలకు భారత మార్కెట్లో ‘రెడ్ శారీ’ పేరిట విడుదలైంది. అయితే ఈ ఎర్ర చీర కాంగ్రెస్ నేతలను భయపెడుతుందా..? లేక లాభం చేకూర్చనుందా..? అన్న ఉత్కంఠ  కాంగ్రెస్ శ్రేణుల్లో వుంది. ఈ పుస్తకంలో అభ్యంతకర కథనాలు వుంటే పుస్తక విక్రయాలను నిలిపివేయాలని తాము న్యాయాస్థానాలను అశ్రయిస్తమాని ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు స్పష్టం చేశారు.

పుస్తకంలో ఉన్న పలు అంశాలపై కాంగ్రెస్ పార్టీ గతంలో అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. అప్పట్లో అధికారంలో వున్న కాంగ్రెస్ తమ హయాంలో ఈ పుస్తకంపై అనధికారికంగా నిషేధాన్ని విధించింది. అయితే ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో వున్న బీజేపి మాత్రం ఈ పుస్తకంపై వేడక చూద్దామని, వేచి చూసే దోరణిని అవలంభిస్తోంది.
 
స్పానిష్ భాషలో తొలుత 2008లో విడుదలైన ఈ పుస్తకంలో అభూతకల్పనలు, అర్ధ సత్యాలు, పరువునష్టం కలిగించే అంశాలు ఉన్నాయని ఆరోపిస్తూ సోనియా తరఫు న్యాయవాదులు 2010లో మోరోకు లీగల్ నోటీసు పంపారు. సోనియా ఆప్తమిత్రులు, సహచరుల నుంచి సేకరించిన సమాచారాన్ని మోరో ఈ పుస్తకంలో పొందుపరిచారు.

సోనియా బాల్యం, రాజీవ్‌గాంధీతో ప్రేమాయణం, ఇందిరాగాంధీ కోడలు కావడం, ప్రధాని అవకాశాన్ని తిరస్కరించడం వంటి అంశాలతో పాలు ఇందిరగాంధీ హత్యానంతర ఘటనలు, రాజీవ్ గాంధీ హత్యానంతర ఘటనలతో పాటు.. అథంపాతాళంలోకి జారుకుంటున్న కాంగ్రెస్ పార్టీని ఎలా కాపాడాలని సోనియా పడిన మనోవేదనను ఇందులో స్పృశించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sonia gandhi  Sonia Gandhi's biography  controversial book  

Other Articles