Parents disown rape victim fearing stigma

parents disown rape victim, rape victim disowned by parents, 10th class girl gang raped, three youth gangraped girl, rape victim, crime against women, voilence against women,. karnataka, gang rape,

The agony of a class 10th student who was allegedly raped by three youths, got further compounded after her parents having disowned her.

తల్లిదండ్రులు వేలేసేంత నేరందా.. ఆ అమ్మాయి..?

Posted: 01/17/2015 01:29 PM IST
Parents disown rape victim fearing stigma

సభ్య సమాజం సిగ్గు పడే పని చేసింది మగ మృగాళ్లు.. కానీ శిక్ష పడింది మాత్రం బాధితురాలికి. పెళ్లి చేసుకుందాం అనే తెలుగు చిత్రంలో కథానాయికకు ఎదురైన పరిస్థితినే ఇక్కడా అ అమ్మాయి కూడా ఎదుర్కుంది. అయితే సినిమాలో చూపించిన కథాంశం హిట్ అయినా.. నిజ జీవితంలో మాత్రం ఆ అమ్మాయికి ఎవరు దిక్కు..?ఎవరో చేసిన నేరానికి ఓ అమ్మాయికి తల్లిదండ్రులు శిక్ష వేశారు. పదో తరగతి చదువుతున్న అమ్మాయిపై ఇటీవల ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలికి అండగా ఉండాల్సిన తల్లిదండ్రులు సమాజానికి భయపడి ఆమెను కాదన్నారు. తమ కూతురి వల్ల కుటుంబం మొత్తం అపఖ్యాతికి గురుకావాల్సి వస్తుందని  భయంతో ఆమెను ఇంట్లోకి రానీయలేదు.

కర్ణాటకలోని గుబ్బి తాలుకాలో గల నిట్టోరులో తల్లిదండ్రులతో కలసి నివాసం వుంటున్న ఓ పదో తరగతి విద్యార్థినిపై బాగురు నివాసి, నిట్టూరులో సెల్ ఫోన్ రిపేరింగ్ షాపు నిర్వహిస్తున్న మంజునాథ (25) , బాగురు గ్రామానికి చెందిన మంజునాథ (25) దేవరాయపట్నకు నివాసి తుమకూరు కారు ఫైనాన్స్ కంపెనీలో పనిచేపే సునిల్ (26).. మరో నిందితుడు 18 ఏళ్ల బాలుడ కలసి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి పిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి వారని అరెస్టు చేశారు. నిందితులు కూడా వారు చేసిన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిపారు.  బాధితురాలిపై అత్యాచారం జరిగినట్లు వైద్య పరీక్షల్లో తేలిందని పోలీసులు చెప్పారు

అయితే జరిగిన విషయాన్ని మర్చిపోవాలని, పోలీసులు, కేసులతో అపఖ్యాతి వద్దని అమ్మాయి తల్లిదండ్రులు అమెను నచ్చజెప్పారు. అయినా నేరస్థులకు శిక్షపడాలని అమ్మాయి పోలీసులకు పిర్యాదు చేయడంతో.. విషయం గ్రామం మొత్తం పాకింది. దీంతో తాము అపఖ్యాతికి గురి కాకూడదని, ఒక అమ్మాయిపై పడిన మచ్చ మరో అమ్మాయికి వ్యాపించకూడదని వారు కన్న కూతరిని ఇంట్లోకి రానీయకుండా తరిమేశారు. దీంతో ప్రస్తుతం బాధితురాలు తుమకూరులోని గవర్నమెంట్ అబ్జర్వేషన్ హోంలో ఉంటోంది.

నేరానికి యువకులను సవిత అనే తార్పుడుగత్తె ప్రేరేపించినట్లు తెలుస్తోంది. అమ్మాయికి మత్తు మందు కలిపిన జ్యూస్ తాగించి నేరానికి పురికొల్పినట్లు చెబుతున్నారు. ఆమెను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : karnataka  gang rape  parents disowned victim  

Other Articles