the biography of maganti annapurna devi who was a great indian women freedom fighter | indian freedom fighters

Maganti annapurna devi biography great indian women freedom fighter

maganti annapurna devi history, maganti annapurna devi freedom fighter, maganti annapurna devi historical story, maganti annapurna devi life history, annapurna devi freedom fighter, great indian women freedom fighters, indian independence movement, mahatma gandhi history

maganti annapurna devi biography great indian women freedom fighter : the biography of maganti annapurna devi who was a great indian women freedom fighter.

స్వాతంత్ర్యోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన అన్నపూర్ణదేవి

Posted: 11/13/2015 06:13 PM IST
Maganti annapurna devi biography great indian women freedom fighter

బ్రిటీష్ రాజ్యంలో వారి అరాచకాలకు వ్యతిరేకంగా మహాత్మాగాంధీ ఇచ్చిన సందేశాలకు ప్రభావితమై ఎందరో స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందులు వున్నప్పటికీ.. బ్రిటీష్ పాలకులకు దేశం నుంచి వెళ్లగొట్టాలనే గట్టి నిర్ణయంతో ముందుకు సాగారు. అలాంటివారిలో మాగంటి అన్నపూర్ణాదేవి ఒకరు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో డబ్బులకోసం రచయితగా మారిన ఈమె.. గాంధీ సందేశాలతో ప్రభావితమై స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించి, వీరవనితగా చరిత్రలో నిలిచింది. అంతేకాదు.. గాంధీజి పిలుపునిచ్చిన ‘విదేశీ వస్తు బహిష్కరణ’లో భాగంగా తాను కొనుగోలు చేసిన చీరల్ని సైతం తగలబెట్టేసింది. ఈ విధంగా స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా ఈమె చేసిన సాహసాలను గాంధీజి మెచ్చుకుని, ఆమెని కొనియాడారు.

జీవిత విశేషాలు :

1900లో ఒక మధ్యతరగతి కుటుంబంలో కలగర రామస్వామి, పిచ్చమ్మ దంపతులకు అన్నపూర్ణాదేవి జన్మించింది. బాల్యం నుంచే ఎంతో చురుకుగా వుండే ఈమె.. అప్పుడే తన ప్రతిభను కనపరచింది. మొదట్లో ఆమె ఇంటివద్దనే చదువుకుంది. అనంతరం.. గుంటూరు మిషన్ స్కూలులో, తర్వాత కలకత్తాలో బ్రహ్మ సమాజం బాలికల పాఠశాలలో చదివింది. కలకత్తాలో శ్రీమతి శకుంతలాదేవి, హేమచంద్ర సిర్కార్ వంటి విద్యావేత్తలు ఆమె చదువు, జీవితం రూపుదిద్దుకోవడంలో సహాయపడ్డారు. ఆమె క్రమశిక్షణా జీవనం అందరినీ ఆశ్చర్యపరిచేది. పాఠశాల విద్యలతోపాటు బెంగాలీ భాషలో మంచి ప్రావీణ్యం సంపాదించింది. బెంగాలీ నుండి తెలుగులోకి పెక్కు అనువాదాలు చేసింది. ఐదేళ్ళ చదువు తరువాత ఏలూరుకు తిరిగి వచ్చిన అనంతరం మద్రాసు విశ్వవిద్యాలయం మెట్రిక్యులేషన్ పరీక్షకు కూర్చొంది. తన చదువుకు అవసరమైన ధనం సంపాదించుకోవడం కోసం 1917లో (తన 17వ యేట) ‘సీతారామ’ అనే పుస్తకాన్ని ప్రచురించింది. ఇంతలోనే ఆమె ఆరోగ్యం దెబ్బతింది. ఒక సంవత్సరంపాటు వైద్యం నిమిత్తం 1919లో మదనపల్లె వెళ్ళింది. 1920లో ఆమె వివాహం మాగంటి బాపినీడుతో జరిగింది. వివాహం తరువాత బాపినీడు ఉన్నత చదువులకు అమెరికా వెళ్ళాడు. అతనితోపాటు అన్నపూర్ణ కూడా వెళ్ళాల్సి వుండేది కానీ.. కుదరలేదు.

భర్త అమెరికాకు వెళ్లిపోయిన తర్వాత భారతదేశంలో ఉన్న అన్నపూర్ణాదేవి... ఆనాడు మహాత్మాగాంధీ ఇచ్చిన సందేశాలకు ప్రభావితమైంది. అంతే! ఆ వెంటనే భారత స్వాతంత్ర్య పోరాటం పనులలో కొనసాగింది. అప్పటికే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నప్పటికీ.. 1200 రూపాయల ఖరీదైన చీరలన్నీ (అమెరికా ప్రయాణం కోసం కొనుక్కున్నవి) తగులబెట్టేసింది. అంతేకాదు.. విదేశీవస్తు బహిష్కరణ బలోపేతం చేసేందుకు ఏలూరులో మోహన్‌దాస్ ఖద్దర్ పరిశ్రమ స్థాపించింది. స్వాతంత్ర్యంపై ప్రజలకు చైతన్యం కలిపించేందుకు ఆంధ్ర దేశమంతటా పర్యటించింది. 1923లో ఆమె భర్త బాపినీడు అమెరికా నుంచి భారత్ కి తిరిగివచ్చాడు. బొంబాయిలో అతను దిగిన వెంటనే.. అన్నపూర్ణ తనతో తెచ్చిన ఖద్దరు బట్టలు అతనికిచ్చి, అతని సూటులన్నీ సముద్రంలో పారవేయమంది. అప్పుడు బాపనీడు భార్య మాటను కాదనుకుండా వెంటనే వాటిని సముద్రంలో పార్చేశాడు. అంతేకాదు.. ఆమె భర్త కూడా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనేలా ప్రేరేపించింది. అప్పుడు తన భర్తతో కలిసి స్వాతంత్ర్యంపై చైతన్యం కల్పించేందుకు మళ్లీ అనేక ప్రాంతాలు పర్యటించింది. ఎన్నో సభలలో ప్రసంగించింది. తన కార్యదీక్ష, సత్ప్రవర్తనల ద్వారా అందరి మన్ననలూ పొందింది. స్వాతంత్ర్యోద్యమంలో ఆమె పోషించిన పాత్రకు ఆశ్చర్యపోయిన గాంధీ.. ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. గాంధీ ఆమె గురించి she had already ‘acquired a gentle but commanding influence over her husband, by her purity and single-minded devotion’ అని రాశారు.

అయితే.. 1924లో ఆమె ఆరోగ్యం మళ్ళీ క్షీణించసాగింది. చికిత్స నిమిత్తం భర్తతో కలిసి అనేక ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళింది. ఈ సమయంలోనే రామకృష్ణ పరమహంస బోధనలను తెలుగులోకి అనువదించింది. భారతదేశం భవిష్యత్తులో మహిళల పరిస్థితి గురించి ‘నారి’ అనే పుస్తకం వ్రాసింది. 1927 నవంబరు 9న ఆమె మరణించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maganti annapurna devi  indian women freedom fighter  mahatma gandhi  

Other Articles