the biography of vandana siva Who is An Indian scholar and environmental activist | women empowerment

Vandana siva biography famous indian scholar and environmental activist

vandana siva biography, vandana siva life history, vandana siva wikipedia, environmental activist, indian scholar, vandana siva biodata

vandana siva biography famous Indian scholar and environmental activist : the biography of vandana siva Who is An Indian scholar and environmental activist.

పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమించిన స్త్రీవాద రచయిత్రి

Posted: 11/05/2015 06:30 PM IST
Vandana siva biography famous indian scholar and environmental activist

ఒకప్పుడు పచ్చదనంతో స్వచ్ఛ వాతావరణం నిండివున్న ఈ ప్రపంచం కాలక్రమంలో కాలుష్యం అవుతూ వస్తోంది. కనీస అవసరాలను తీర్చుకోవడం కోసం చెట్లను కూల్చేయడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ విషయాన్ని పసిగట్టిన కొందరు ప్రముఖులు... అలా జరగనివ్వకుండా ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం పాటపడ్డారు. అలాంటివారిలో వందన శివ ఒకరు. ఈమె పర్యావరణ పరిరక్షణతోపాటు వ్యవసాయం, ఆహార లక్షణాల అలవాట్లో మార్పు తెచ్చేందుకు ఎంతో కృషి చేశారు.

జీవిత విశేషాలు :

1952 నవంబర్ 5వ తేదీన డెహ్రాడూన్ లోయనందు వందన శివ జన్మించారు. ఈమె తండ్రి అటవీ సంరక్షుడుకాగా.. తల్లి ప్రకృతి ప్రేమికురాలు, వ్యవసాయదారిణి. నైనిటాల్లోని సెయింట్ మేరీ స్కూల్లో, డెహ్రాడూన్లోని కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీలో విద్యను అభ్యసించింది. భౌతికశాస్త్రంలో డిగ్రీ పట్టా పొందిన తరువాత ‘చేంజెస్ ఇన్ ది కాన్సెప్ట్ ఆఫ్ పీరియాడిసిటీ ఆఫ్ లైట్’ అనే పరిశోధనా వ్యాసంతో (అంటారియో, కెనడా) గ్వెల్ఫ్ విశ్వవిద్యాలయం నుండి తత్వశాస్త్రంలో ఆమె ఎం.ఏ పూర్తి చేసింది. 1979లో ఆమె తన పి.హెచ్.డి పూర్తి చేసి, యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ అంటారియో నుండి పట్టా పొందింది. ఆమె పరిశోధన అంశము ‘హిడెన్ వేరియబుల్స్ అండ్ లోకాలిటి ఇన్ క్వాంటం థిరీ’. అనంతరం బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్లలో విజ్ఞాన, సాంకేతికశాస్త్రము, పర్యావరణ పాలసీలపై బహుళశాస్త్ర పరిశోధనకు వెళ్ళింది.

వ్యవసాయం, ఆహార లక్షణాలు అలవాట్లో మార్పుకోసం ఈమె తీవ్రంగా పోరాడింది. మేధో సంపత్తి హక్కులు, జీవ వైవిధ్యము, జీవ సాంకేతిక విజ్ఞానము, జీవ నీతి, జన్యు ఇంజినీరింగ్ మొదలైన క్షేత్రాలలో శివ మేధో సంపత్తితో, ప్రచారోద్యమాల ద్వారా పాల్గొంది. 1982లో నవ్దన్య ఏర్పాటుకు దారితీసిన వైజ్ఞానిక, సాంకేతిక, జీవావరణ శాస్త్రాల పరిశోధనా సంస్థను ఆమె స్థాపించింది. మూడవ ప్రపంచపు మహిళల సామర్ధ్యాలను పునర్నిర్వచించటానికి ఆమె వ్రాసిన పుస్తకం ‘స్టేయింగ్ అలైవ్’ దోహదపడింది. ప్రపంచీకరణపై అంతర్జాతీయ వేదిక, మహిళల పర్యావరణ, అభివృద్ధి సంస్థ, థర్డ్ వరల్డ్ నెట్వర్క్ వంటి ప్రభుత్వేతర సంస్థలతోపాటు భారత ప్రభుత్వ, విదేశీ ప్రభుత్వాలకు సలహాదారుగా శివ సేవలందించింది. సంరక్షణా, జీవావరణలలో, ఆహార భద్రతలపై అద్భుతమైన సేవలు అందించి, ఇతరులకు మార్గదర్శకంగా నిలిచింది. ఈమె అందించిన సేవలకు ఎన్నో అవార్డులు కూడా లభించాయి.

పర్యావరణస్త్రీవాద ఉద్యమలో ఈమె ముఖ్య పాత్రను పోషించింది. ఆమె వ్రాసిన వ్యాసము ‘ఎంపవరింగ్ ఉమెన్’ ప్రకారం శివ సలహా ఇస్తూ.. వ్యవసాయరంగంలో భరించదగిన నిర్మాణాత్మక సామీప్యతను శ్రామిక మహిళల చుట్టూ ఎక్కువగా కేంద్రీకృతమై ఉండే వ్యవసాయ పద్ధతిని తిరిగి ప్రవేశపెట్టుట ద్వారా సాధించవచ్చు అని తెల్పింది. స్త్రీల ‘బహిష్కరణపై పూర్వకాల తర్క’ ప్రాబల్యానికి వ్యతిరేకంగా వాదిస్తూ, స్త్రీలు ప్రధాన కేంద్రముగా కలిగిన పధ్ధతి ప్రస్తుత వ్యవస్థను పూర్తి ప్రయోజనకర రీతిలో మార్చుతుందఅని ప్రతిపాదించింది. ఈ విధంగా, వ్యవసాయ పద్ధతులలో మహిళలను సమ్మిళితము చేసి సాధికారిత కేంద్రీకృతం ద్వారా భారత, ప్రపంచ ఆహార భద్రతకు ప్రయోజనం చేకూరుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vandana siva biography  environmental activist  

Other Articles