The Biography Of T Meena Kumari Who Was The First Chief Justice of Meghalaya High Court | Andhra Pradesh

T meena kumari chief justice of meghalaya high court biography andhra pradesh

T Meena Kumari history, T Meena Kumari biography, T Meena Kumari life story, T Meena Kumari lawyer, T Meena Kumari chief justice, T Meena Kumari life history, indian women lawyers, indian women justice, indian women, women empowerment

T Meena Kumari Chief Justice of Meghalaya High Court Biography Andhra Pradesh : The Biography Of T Meena Kumari Who Was The First Chief Justice of Meghalaya High Court. She previously served as the judge of Andhra Pradesh High Court and Patna High Court.

మేఘాలయ రాష్టానికి చెందిన తొలి ప్రధాన న్యాయమూర్తి

Posted: 08/06/2015 04:53 PM IST
T meena kumari chief justice of meghalaya high court biography andhra pradesh

సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలంటే ఏదో ఒక మార్గాన్ని అనుసరించాల్సి వుంటుంది. కొందరు ఉద్యమాలు జరిపి లీడర్ గా నిలబడితే.. మరికొందరు న్యాయపరమైన విధానాలను అనుసరించి అవినీతిపై పోరాటం కొనసాగిస్తారు. అలా రెండో విధానాన్ని అనుసరిస్తూ ముందుకు నడుస్తున్న వారిలో టీ.మీనాకుమారి ఒకరు. ‘లాయర్’ కుటుంబంలో జన్మించిన ఆమె.. సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై పోరాటం కొనసాగించేందుకు వారసత్వ వృత్తినే ఎంచుకున్నారు. ఆ రంగంలో తన సత్తా చాటుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ.. నూతనంగా ఏర్పడిన మేఘాలయ రాష్టానికి తొలి ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నుకోబడ్డారు.

జీవిత విశేషాలు :

1956 ఆగష్టు 3 తేదీన విశాఖపట్నం జిల్లాలోని యలమంచిలిలో జానపరెడ్డి, రాజమణి దంపతులకు మీనాకుమారి జన్మించారు. ఈమె ప్రముఖ వాయులీన విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడి మనుమరాలు. ఈమె బి.యస్.సి. పూర్తిచేసిన తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రం అభ్యసించి, 1976 నుండి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా వృత్తిజీవితాన్ని ప్రారంభించారు. 1981 నుంచి 1984 వరకు అసిస్టెంట్‌ ప్రభుత్వ ప్లీడరుగా, 1988-89 మధ్యకాలంలో ఆదాయపన్నుల శాఖ జూనియర్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేశారు.

1990లో హైకోర్టు ప్రభుత్వ ప్లీడరుగా మీనాకుమారి నియమితులయ్యారు. 1994 వరకు ఆమె ఆ పదవిలో ఉన్నారు. విద్య, పౌరసరఫరాలు, కాలుష్య నియంత్రణ, విద్యుత్‌ వంటి విభాగాలకు ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. 1998 ఫిబ్రవరి 23 తేదీ నుండి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం మద్రాసు హైకోర్టుకు బదిలీపై వెళ్ళారు. 1999లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2001 సెప్టెంబర్ 5 తేదీన ఆంధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. స్వల్పకాలం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. అనంతరం పాట్నా హైకోర్టుకు బదిలీ చేయబడ్డారు.

మీనాకుమారి 2013 మార్చి 23న కొత్తగా ఏర్పాటు చేయబడిన మేఘాలయా రాష్ట్ర హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డారు. 2013 మార్చి 24వ తేదీర మేఘాలయ చీఫ్ జస్టిస్ గా మీనాకుమారి ప్రమాణం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : T Meena Kumari  Indian Women Lawyers  Meghalaya State  

Other Articles