The harmful diseases with the using of laptop regularly

laptop problems, laptop diseases, health problems with laptops, health risks with laptops, laptop health diseases, laptop health causes, health tips, laptop using tips

the harmful diseases with the using of laptop regularly

లాప్ టాప్స్ ఎక్కువగా వాడితే వచ్చే ఆరోగ్య ప్రమాదాలు

Posted: 11/13/2014 04:36 PM IST
The harmful diseases with the using of laptop regularly

ప్రస్తుత బిజీ ప్రపంచంలో ల్యాప్ టాప్స్ వాడకం తప్పనిసరి అయిపోయింది. ఆఫీసుల్లో మిగిలిపోయిన పనులను పూర్తిచేసుకునేందుకు ప్రతిఒక్కరు ల్యాప్ ట్యాప్ లను కొనుగోలు చేస్తుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ల్యాప్ టాప్ కూడా మానవ నిత్యజీవితంలో ఒక వాడక వస్తువుగా మారిపోయింది. కేవలం ఆఫీసు పనులకోసమే కాదు.. ఇతర ఉపయోగాలకూ ల్యాప్ టాప్స్ బాగానే పనికొస్తాయి. కానీ వీటిని తరచూ ఉపయోగించడం వల్ల అనేకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీర్ఘకాలిక జీవన రుగ్మతలకు దారితీస్తుంది. నొప్పి,కండరముల బిరుసు, కన్నుఒత్తిడి మరియు క్యాన్సర్ వంటి ఆరోగ్య ప్రభావాలను ఎదుర్కోవలసి వస్తుంది. వీటివల్ల కలిగే ఆరోగ్య సమస్యలేంటో తెలుసుకుందాం...

1. వెన్నునొప్పి : ల్యాప్ టాప్ లను సాధారణంగా ఒడిలో పెట్టుకోవడం వల్ల ముందుకు వంగి కూర్చోవాల్సి వస్తుంది. దీంతో మాంద్యానికి గురవుతతారు. అప్పుడు వెనుకభాగం టోల్ పడుతుంది. దీంతో వెన్నునొప్పి సమస్య ఏర్పడుతుంది. ఇది స్పాండిలైటిస్ గా దారితీస్తుంది.

2. వంధ్యత్వం : లాప్ టాప్ ఒడిలో పెట్టుకొని ఉపయోగించటం వల్ల పురుషులలో వంధ్యత్వం అనేది ప్రధాన ఆరోగ్య సమస్య ఏర్పడుతుంది. లాప్ టాప్ వేడి వలన స్పెర్మ్ కు నష్టం కలుగుతుంది. దాని వికిరణాలు స్పెర్మ్ చలనము, నాణ్యత మీద ప్రభావితం చూపుతుంది.

3. కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ : సాధారణ డెస్క్ టాప్ కంటే ల్యాప్ టాప్ ను ఎక్కువ దగ్గరగా కూర్చొని స్క్రీన్ చూడాల్సి వస్తుంది. ఇలా తరుచూ చేస్తే.. కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అనే సమస్య వస్తుంది. దీంతో కళ్ళు ఒత్తిడి, పొడిదనానికి దారితీస్తుంది.

4.  క్యాన్సర్ : చాలామంది ల్యాప్ టాప్ ను గంటల తరబడి వాడుతూనే వుంటారు. అదికూడా ఒడిలో పెట్టుకొని పనిచేస్తుంటారు. అలా చేస్తే... చర్మం దురదగా, వేడిగా మారుతుంది. దీంతో చర్మ క్యాన్సర్ కి దారి తీయవచ్చు.

5. వేళ్లు గుంజుకుపోవడం : ఇక ల్యాప్ టాప్ లో పొందుపరిచిన ఇరుకైన కీ బోర్డును గంటల తరబడి ఉపయోగించటం వల్ల... వేళ్ల కండరాలు పట్టేయడం లేదా తిమ్మిరి వస్తుంది. ఈ సమయంలో వేలు కండరాలు స్తంభన జరగవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : health tips  laptop health diseases  telugu news  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more