Healthy fruits cool drinks improves brain power human bodies

healthy cool drinks, health tips, healthy cool drinks, healthy fruit drinks, fruits drinks, brain power, brain health tips, brain problems, human bodies

healthy fruits cool drinks improves brain power human bodies

ఉల్లాసంగా.. ఉత్సాహంగా వుంచే ‘కూల్ డ్రింక్స్’

Posted: 11/12/2014 04:35 PM IST
Healthy fruits cool drinks improves brain power human bodies

సాధారణంగా మార్కెట్లో లభ్యమయ్యే కూల్ డ్రింక్స్ చాలావరకు ఎక్కువ మోతాదుతో కూడిన షుగర్ తోనే తయారవుతాయి. అటువంటివాటిని తీసుకుంటే ఎన్నో ఆరోగ్యకరమైన సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి వాటిని నిత్యం తీసుకోవడం మానేసి.. ఇంట్లోనే కొన్ని పోషక విలువలు కలిగిన పండ్లతో డ్రింక్స్ తయారుచేసుకుని తాగితే మానవ శరీర ఆరోగ్యానికి ఎంతో మంచిది. శరీరంలో వున్న అవయవాలన్నింటికీ కావాలసిన పోషకాలు, మూలకాలు, ఇతర ఖనిజాలు పుష్కలంగా వుంటాయి. అవి మెదడును ఎల్లప్పుడూ ఫ్రెష్ గా వుంచుతూ... గుండె సంబంధిత వ్యాధుల నుంచి దూరంగా వుంచుతాయి. మరి ఆ కూల్ డ్రింక్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం...

1. దానిమ్మ జ్యూస్ : ఇందులో జ్ఞాపకశక్తిని, మెమరీ పవర్ ను మెరుగుపరిచే యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా వుంటాయి.

2. గ్రీన్ లేదా బ్లాక్- టీ : మెదడును నిత్యం చురుకుగా వుంచే ఇజిసిజి లేదా ఎపిగలోకొటెచిన్-3-గల్లేట్ వంటివి గ్రీన్ టీలో పుష్కలంగా వుంటాయి కాబట్టి దానిని ప్రతిరోజూ తీసుకుంటే మంచిది. అలాగే గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బ్రెయిన్ సెల్స్ ఉత్పత్తిని పెంచడంతో పాటు బ్రెయిన్ ను షార్ప్ గా ఉంచుతుంది. ఈరకమైన పోషకాలు బ్లాక్ టీలోనూ వుంటాయి.

3. బెర్రీ స్మూతీస్ : బెర్రీస్, బ్లూబెర్రీస్ రెండింటిలోనూ బ్రెయిన్ కు సంబంధించిన న్యూరోనల్ యాక్టివిటి వుంటుంది. ఇవి మెంటల్ డిక్లెయిన్ ను నివారిస్తుంది. అంతే కాదు బ్రెయిన్ మెమీరితోపాటు జ్జాన నైపుణ్యం మెరుగుపరుస్తుంది.

4. కొబ్బరి నీళ్లు : ఇందులో కొవ్వు అసలే ఉండదు. అలాగే చెక్కర శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి దీనిని తాగితే శరీర ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు బ్రెయిన్ హెల్త్ కు మంచిది. డిహైడ్రేట్ అయిన శరీరాన్ని తిరిగి హైడ్రేట్ చేస్తుంది. జీర్ణక్రియను వృద్ధి చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. క్యాన్సర్ కారకాలను తగ్గిస్తుంది. జీర్ణశక్తిని పెంచడం మొదలుకొని మూత్రపిండాల్ని శుభ్రం చేయడం దాకా..బోలెడన్ని ఆరోగ్య సేవలు అందిస్తుంది. కొబ్బరి నీళ్లలో చిటికెడు ఉప్పు, పంచదార కలుపుకుని తాగితే డీహైడ్రేషన్ సమస్య ఉండదు. కొబ్బరి నీళ్ళలో ఉండే ఎలక్ట్రోలైట్స్, విటమిన్స్, మినిరల్స్ బ్లడ్ సర్కులేషన్ తోపాటు  బ్లడ్ ఫ్లోను మెరుగుపరుస్తుంది.

5. బీట్ రూట్-క్యారెట్-ఆపిల్ జ్యూస్: మానవశరీర ఆరోగ్యానికి అవసరమయ్యే యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్, మినిరల్స్ వీటిలో పుష్కలంగా ఉన్నాయి. బీట్ రూట్ జ్యూస్ మొదడులో నైట్రస్ ఆక్సైడ్ ను పెంచడంతోపాటు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. క్యారెట్ లో వుండే బీటా కెరోటిన్ పోషకం కళ్ళు ఆరోగ్యానికి, మెదడు క్షీణత స్ధంబనకు సహాయపడుతుంది. ఇక ఆపిల్ జ్యూస్ న్యూరోడిజనరేటివ్ డిసీజ్, ఆల్జైమర్స్ ను నివారిస్తుంది.

6. నీళ్ళు : రోజూ కనీసం మూడు లీటర్ల నీళ్లు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని డాక్టర్లు సలహాలు ఇస్తుంటారు. నీరు, చర్మంలోని తేమను కాపాడి, కాలుష్యాన్ని బయటికి పంపుతుంది. రక్తాన్ని శుద్దిచేస్తుంది. తగినన్ని నీరు త్రాగడం వల్ల మెదడుకు తగినంత ఆక్సిజన్ అందించబడి, మెదడు చురుకుగా పనిచేసేందుకు సహాయపడుతుంది.

7. రెడ్ వైన్ : ఇందులో మెదడుకు అవసరమయ్యే ఫాలీఫినాల్స్ వుంటుంది. ఇది మెదడకు రక్తప్రసరణను పెంచుతుంది. మొదడు సామర్థ్యం పెంచుకోవడానికి ఇది ఒక బూస్ట్ లా పనిచేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : health tips  healthy cool drinks  brain healthy tips  telugu news  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more