Glorious plans for the best future

financial tips, glorious plans for future, organizing tips, financial tips for future, financial problems, home loans, policies for savings money, savings account, savings money plans

glorious plans for the best future to live without financial problems

భవిష్యత్ ఉజ్వలంగా వుండటానికిగల ప్రణాళికలు!

Posted: 10/08/2014 03:41 PM IST
Glorious plans for the best future

సాధారణంగా జీవితంలో ప్రతిఒక్కరికి కొన్ని తప్పనిసరి బాధ్యతలు వుంటాయి. అయితే వీటి అవగాహన ముందుగానే లేకపోవడం కారణంగా వాటిని పట్టించుకోకుండా కేవలం తమతమ కోరికలను అప్పటికప్పుడే తీర్చుకోవడంలో విలువైన డబ్బులను, సమయాన్ని వృధా చేస్తుంటారు. అటువంటి సమయాల్లో భవిష్యత్ లో అవసరమయ్యే ఒక ఆర్థిక రక్షణ గురించి ఒక్కసారి కూడా ఆలోచించరు. నిజానికి ఇదే మొదటిగా చేసే అతిపెద్ద తప్పు. ప్రస్తుతకాలంలో ద్రవ్యోల్బణ ఒత్తిడి కూడా చాలా పెరిగిపోతోంది. బయట మార్కెట్లలలో కూడా ధరలు ఏకధాటిగా పెరిగిపోతున్నాయి. పైగా బాధ్యతలు కూడా ఎక్కువైపోతున్నాయి. అటువంటి పరిస్థితులు మరీ ఎక్కువగా పెరిగిపోతే.. భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి.. సంపాదిస్తున్న కష్టార్జితంలో పరిస్థితులకు అనుగుణంగా ఎక్కువ ఖర్చులు చేయకుండా డబ్బులు ఆదా చేసుకుంటే మంచిది. అందుకు ఉపయోగపడే కొన్ని ప్రణాళికలు మీకోసం..

ఉజ్వల భవిష్యత్ కోసం అవసరమయ్యే ప్రణాళికలు...

ముందుగా పాటించాల్సిన నియమం ఏమిటంటే.. అవసరాలకు తగ్గట్టుగానే డబ్బులను వెచ్చించడం ఎంతో శ్రేయస్కరం. అంటే.. అనవసరంగా ఖర్చులు చేయకుండా డబ్బులను అదుపులో వుంచుకోవాల్సి వుంటుంది. పిల్లల చదువులకు కావలసిన ఖర్చులు, ఇంట్లో ఖర్చులు ఇలా రకరకాల బాధ్యతలు వుంటాయి. వాటికి కావలసిన డబ్బును మాత్రమే కేటాయించుకోవాలి. ఇప్పుడు మదుపు చేసుకుంటే.. భవిష్యత్ లో వచ్చే కష్టాలను ఎదుర్కోవడంతోపాటు సుఖంగా జీవితాన్ని గడపవచ్చు. ప్రస్తుతకాలంలో మదుపు చేసుకోవడానికి చాలారకాల పథకాలు వున్నాయి. బీమా పాలసీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు వంటి తరహా పథకాలు వున్నాయి. ఇవి దీర్ఘకాలికంగా సాగే పథకాలు కాబట్టి.. మీ లక్ష్యాలను, నష్టభయాన్ని బట్టి ఇందులోనుంచి ఏదో ఒక పథకాన్ని ఎంచుకోవచ్చు.

ఆరోగ్య బీమా : ఆరోగ్య బీమా చేయించుకోవడం చాలా తప్పనిసరి. పైగా ప్రస్తుతకాలంలో వైద్యఖర్చలు మరీ ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ముందుగానే ఈ పాలసీలను తీసుకొని, కొనసాగిస్తే.. అనుకోని ఆరోగ్య సమస్యలు ఎదురయినప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సిన అవసరం వుండదు.

ఎండోమెంట్ పాలసీ : డబ్బులను పొదుపు చేయడానికి ఇది ఎంతో మంచి పథకం. ఇవి దీర్ఘకాలంపాటు సాగే పథకాలు కాబట్టి.. వీటిని క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లిస్తే.. వ్యవధి తీరిపోయిన తరువాత మీరు డబ్బుతోపాటు బోనస్, ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఒకవేళ పాలసీదారుడికి ఏమైనా అయితే.. ఆ డబ్బును నామినీకి ఇచ్చేస్తారు.

పెట్టుబడులు : అధిక లాభాలను ఎక్కువగా రాబట్టుకోవడానికి ఇది సులభమైన మార్గం. అందుకే చాలామంది దీనివైపు దృష్టి సారిస్తుంటారు. అయితే ఇందులో తొందరపాటు నిర్ణయాలు అంత మంచివి కావు. పెట్టుబడులు పెట్టేడానికి ముందుగానే అందులో వచ్చే నష్టాలను, లాభాలను లెక్కలేసుకోవాలి. ఒకవేళ నష్టం వస్తే.. దానిని భరించగలిగే ధైర్యాన్ని కలిగి వుండాలి. అదే విధంగా ఏదైన ఒక కంపెనీని, సంస్థను స్థాపించడానికి ముందు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే అందులో వచ్చే లొసుగుల్ని ఎదిరించి.. భవిష్యత్ లో వచ్చే సమస్యలను ఎదుర్కోగలుగుతాము.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : financial tips  savings money plans  organizing tips  future plans  mutual funds  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more